Coronavirus in India: వరుసగా 5వ రోజు 3 లక్షలకు పైనే కరోనా కేసులు.. 22 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు..

By Sumanth KanukulaFirst Published Jan 24, 2022, 10:07 AM IST
Highlights

భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. వరుసగా ఐదో రోజు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,06,064 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 8.2 శాతం తగ్గింది. 

భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. వరుసగా ఐదో రోజు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,06,064 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 8.2 శాతం తగ్గింది. తాజా కేసులతో కలిపి.. భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,95,43,328కి చేరింది. నిన్న దేశంలో కరోనాతో 439 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల (Covid deaths) సంఖ్య 4,89,848కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

గత 24 గంటల్లో 2,43,495 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,68,04,145కి చేరింది. ప్రస్తుతం దేశంలో 22,49,335 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు.. 20.75 శాతంగా ఉంది. మరోవైపు వీక్లీ పాజిటివిటీ రేటు 17.03 శాతానికి పెరిగింది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు.. 93.07 శాతం, మరణాల రేటు 1.24 శాతం, యాక్టివ్ కేసుల శాతం 5.69 శాతంగా ఉంది.  

తాజా కేసులతో అత్యధిక కేసులు నమోదైన ఐదు రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటకలో 50,210, కేరళలో 45,449, మహారాష్ట్రలో 40,805, తమిళనాడులో 30,580, గుజరాత్‌లో 16,617గా ఉన్నాయి. 

ఇక, ఆదివారం రోజున (జనవరి 23) దేశంలో 14,74,753 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 71,69,95,333కి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 27,56,364 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,26,07,516కి చేరింది. 

ఇదిలా ఉంటే.. దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని సార్స్‌–కోవ్‌–2 జెనోమిక్స్‌ కన్సార్టియం (ఇన్సాకాగ్) తెలిపింది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లుగా అంచనా వేసింది. ‘కరోనా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో పలు మెట్రో నగరాలలో వ్యాపించడంతో పాటు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆ కారణంగానే ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. మెట్రో నగరాల్లో నమోదవుతున్న ఎక్కువ కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే. కొన్నిచోట్ల ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన BA.2 వ్యాప్తి చెందుతుంది. S-జీన్ డ్రాప్-అవుట్ అనేది ఓమిక్రాన్ మాదిరిగానే జన్యు వైవిధ్యం’ అని పేర్కొంది.

click me!