ఏ మాత్రం తగ్గని కరోనా విజృంభణ.. దేశంలో కొత్తకేసులు ఎన్నంటే...

By AN TeluguFirst Published May 3, 2021, 10:37 AM IST
Highlights

దేశంలో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ  వైరస్ కు నిత్యం వేల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రతి రోజూ లక్షల మందికి సోకుతూ.. మన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూనే ఉంది. 

దేశంలో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ  వైరస్ కు నిత్యం వేల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రతి రోజూ లక్షల మందికి సోకుతూ.. మన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూనే ఉంది. 

తాజాగా గడిచిన 24 గంటల్లో 3.68 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 15 లక్షల 4 వేల ఆరు వందల 98 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 3,68,147 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.99 కోట్లకు చేరింది.

ఇదే సమయంలో  వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండటం ఊరటనిస్తుంది .గడచిన 24 గంటల వ్యవధిలో మరో 3,00,732 మంది కోవిడ్ ను జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1.62 కోట్ల మంది కరోనా నుంచి కోల్పోగా.. రికవరీ రేటు 81.77శాతంగా ఉంది

మరణాల సంఖ్య మరోసారి మూడు వేలకు పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా  3417 మంది చనిపోయారు. మహమ్మారి దేశంలో ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు రెండు లక్షల 18వేల 959 మళ్లీ వైరస్ కు బలి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కొత్త కేసులు పెరుగుతుండడంతో దేశంలో క్రియాశీల కేసులు 34 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34,13,642 యాక్టివ్ కేసులుండగా.. క్రియాశీల రేటు 17.1 3 శాతానికి చేరింది.

ఇక దేశంలో టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. చాలాచోట్ల టీకాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కేవలం 12 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగ ఇప్పటివరకూ 15.71 కోట్ల మంది ప్రాణాలు తీసుకున్నారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!