భర్త ‘గే’.. విషయం దాచి పెళ్లి.. మూడేళ్ల తర్వాత..!

Published : Jul 27, 2021, 08:41 AM IST
భర్త ‘గే’.. విషయం దాచి పెళ్లి.. మూడేళ్ల తర్వాత..!

సారాంశం

చొరవ చూపించి తాను దగ్గరౌదామని ప్రయత్నించినా.. ఏదో ఒక కారణం చెప్పి దూరం పెట్టేవాడు. పైగా అదనపు కట్నం కావాలని చెప్పేవాడు.

వారికి పెళ్లై దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన  సదరు యువతికి.. భర్త దగ్గర నిరాశే ఎదురైంది. భర్త కౌగిలిలో కరిగిపోవాలని ఆమె ఎన్నో కలలు కన్నది.. కానీ.. ఆ భర్త కనీసం తన వైపు కన్నెత్తి అయినా చూడడు. ఎంత అందంగా ముస్తాబించుకున్నా.. ఎ ప్రశంస కూడా దక్కదు. అంతేనా.. మూడేళ్ల అయినా.. భర్త కనీసం తనని తాకను కూడా తాకలేదు.

చొరవ చూపించి తాను దగ్గరౌదామని ప్రయత్నించినా.. ఏదో ఒక కారణం చెప్పి దూరం పెట్టేవాడు. పైగా అదనపు కట్నం కావాలని చెప్పేవాడు. అతను అడిగినంత ఇచ్చినా.. తనని మాత్రం దగ్గరకు రానివ్వలేదు. దీంతో.. భర్త ప్రవర్తనకు కారణమేంటా అని ఆమె ప్రయత్నించగా.. అసలు విషయం బయటపడింది. తన భర్త గే అని తెలుసుకొని షాకైంది. ఇప్పుడు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.  ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

31 ఏళ్ల బ్యాంకు ఉద్యోగితో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి 2018 జూన్‌లో వివాహమైంది. అతడికి ఇది రెండో వివాహం. పెళ్లయినప్పటి నుంచి ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. ఏమని ప్రశ్నిస్తే మొదట్లో అదనపు కట్నం తెస్తేనే అని పట్టుబట్టాడు. దీంతో ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. అయినా కూడా కలయికకు ఆసక్తి చూపించలేదు.

 అడిగిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడు.  ఇలా ఏకంగా మూడేళ్ల పాటు దూరం పెడుతూ వచ్చాడు. అయితే అతడు తరచూ ఫోన్‌లో బిజీగా ఉన్నాడు. వేరే యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడేమోనని  అనుమానంతో అతడి ఫోన్‌ తీసుకుని పరిశీలించింది. అయితే అతడు పురుషులతో లైంగికపరమైన విషయాలు చాటింగ్‌ చేయడం చూసి ఆమె షాకైంది.  గట్టిగా నిలదీయడంతో.. తాను గే అని అంగీకరించాడు. 
తాను స్వలింప సంపర్కుడినని.. గే డేటింగ్‌ యాప్‌లలో ప్రొఫైల్‌ ఉందని అంగీకరించాడు. దీంతో ఆమె అతడితో విడిపోవాలని నిశ్చయించుకుంది. వెంటనే ఆమె బవసణ్నగుడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌