ఇండియాలో గత 24 గంటల్లో 28,591 కరోనా కేసులు: కేరళలోనే 20 వేలకుపైగా

Published : Sep 12, 2021, 11:02 AM IST
ఇండియాలో గత 24 గంటల్లో 28,591 కరోనా కేసులు: కేరళలోనే 20 వేలకుపైగా

సారాంశం

ఇండియాలో గత 24 గంటల్లో  28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 338 మంది మరణించారు. దేశంలో కరోనాతో  మరణించిన వారి సంఖ్య 4,42,655కి చేరుకొంది.నిన్న ఒక్క రోజే కరోనా నుండి 34,848 మంది కోలుకొన్నారు.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు కరోనాతో 338 మంది చనిపోయారు. కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో నమోదౌతున్నవే కావడం గమనార్హం. 

నిన్న ఒక్క రోజే కేరళ రాష్ట్రంలో 20,487 కరోనా కేసులు రికార్డయ్యాయి. నిన్న  ఒక్క రోజే కేరళ రాష్ట్రంలో 181 మంది కరోనాతో మరణించారు.దేశంలో కరోనాతో  మరణించిన వారి సంఖ్య 4,42,655కి చేరుకొంది.నిన్న ఒక్క రోజే కరోనా నుండి 34,848 మంది కోలుకొన్నారు. ఇండియాలో కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 3,24,09,345కి చేరింది. ప్రస్తుతం కరోనా రోగుల రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది.

మరో వైపు ఇండియాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,84,921కి చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య 1.61 శాతంగా ఉంది.దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కూడ వేగంగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే 72,86,883 వ్యాక్సిన్ తీసుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు 73.82 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది.


 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word