గుడ్‌న్యూస్: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు

By narsimha lodeFirst Published Jun 2, 2021, 10:06 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో 1,32,788 కరోనా కేసులు రిపోర్టయ్యాయి. గత 24 గంటల్లో 3207 మంది కరోనాతో మరణించారు.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో 1,32,788 కరోనా కేసులు రిపోర్టయ్యాయి. గత 24 గంటల్లో 3207 మంది కరోనాతో మరణించారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,83,07,832కి చేరుకొంది. కరోనాతో మరణించినవారి సంఖ్య 3,35,102కి చేరుకొంది.  ఇండియాలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 17,93,645కి చేరుకొంది. దేశంలో ఇప్పటివరకు 35,00,57,330మంది శాంపిల్స్ సేకరించారు.  నిన్న ఒక్క రోజే  20,19,773  శాంపిల్స్ సేకరించారు. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 6.57 శాతానికి చేరుకొంది. 

దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.  26,513 కేసులు తమిళనాడులో నమోదు కాగా ఆతర్వాతి స్థానంలో కర్ణాటక నిలిచింది. కర్ణాటకలో 14,304, మహారాష్ట్రలో 14,123 కేసులు, కేరళలో 19,760 , ఆంధ్రప్రదేశ్ లో 12,400, బెంగాల్ లో 10,137 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ రికార్డులు చెబుతున్నాయి.కొన్ని రోజులుగా ఇండియాలో కరోనా కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది. 

click me!