ప్రియుడితో కలిసి కూతురు పరార్.. అవమానం తట్టుకోలేక..!

Published : Jun 02, 2021, 09:15 AM IST
ప్రియుడితో కలిసి కూతురు పరార్.. అవమానం తట్టుకోలేక..!

సారాంశం

ఆమెను ఎంతో ప్రేమగా.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే.. శిల్ప.. తమ గ్రామానికి చెందిన పునీత్ అనే యువకుడిని ప్రేమించింది.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె.. వారికి కాదని వెళ్లిపోయింది. ప్రియుడితో కలిసి పారిపోయి.. వారికి తీరని శోఖాన్ని మిగిల్చింది. ప్రేమించిన వాడి కోసం.. కూతురు తమను వదిలేసి వెళ్లిపోవడం తట్టుకోలేని తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం రామనగర్ జిల్లా  చెన్నపట్టణ తాలుకా సంకెన్నహళ్లి కి చెందిన గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు రమేశ్(50), శైలజ(42) దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె శిల్ప. ఆమెను ఎంతో ప్రేమగా.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే.. శిల్ప.. తమ గ్రామానికి చెందిన పునీత్ అనే యువకుడిని ప్రేమించింది.

వారిద్దరిదీ ఒకే సామాజిక వర్గం కూడా. అయితే..  ప్రేమ విషయం చెబితే ఇంట్లో ఒప్పుకోరేమో అనే భయంతో.. ఇంట్లో చెప్పకుండా ప్రియుడితో కలిసి పరారయ్యింది. ప్రేమికులు సోమవారం వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన రమేశ్‌, శైలజ పరువుపోయిందని తీవ్రంగా విచారించారు. రాత్రి పొద్దుపోయాక తోటలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఇరువురూ మృతి చెందారు. ఎంకే దొడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu