ఇండియాలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

By narsimha lodeFirst Published May 30, 2021, 11:42 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు మూడు రోజులుగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,65,553 కేసులు నమోదయ్యాయి. ఒక రోజు వ్యవధిలో 3,460 మంది చనిపోయారు. 

న్యూఢిల్లీ:ఇండియాలో కరోనా కేసులు మూడు రోజులుగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,65,553 కేసులు నమోదయ్యాయి. ఒక రోజు వ్యవధిలో 3,460 మంది చనిపోయారు. రెండు లక్షలకు దిగువన కరోనా కేసులు నమోదు కావడం వరుసగా ఇది మూడో రోజు. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2.79 కోట్లకు చేరుకొంది. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 3,25,972 మంది ప్రాణాలు కోల్పోయారు.  కరోనాతో మరణించిన వారి రేటు 1.17 శాతంగా నమోదైంది. కరోనాతో మరణిస్తున్నవారి సంఖ్య తగ్గుతోంది. గత 24 గంటల్లో కరోనాతో మరణించిన వారి సంఖ్య ఐదు రోజులతో పోలిస్తే తక్కువగానే ఉందని నివేదికలు చెబుతున్నాయి. 

కరోనా పాజిటివిటీ రేటు వరుసగా 6వ రోజు 10 శాతం లోపు నమోదైంది.  ఒక్క రోజులో 2,76,309 మంది కోలుకొన్నారు. రికవరీ రేటు 91.25 శాతానికి పెరిగింది. క్రియాశీలక కేసుల సంఖ్య మరింత తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ లో గతంలో రోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులు సగానికి పడిపోయాయి. మే 26వ తేదీన కరోనాతో 4,040 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాతో మరణించన వారి సంఖ్య నాలుగు వేలలోపుగా పడిపోయింది. 

click me!