దేశంలో తీవ్రరూపం దాలుస్తున్న కరోనా.. ఒక్కరోజే 62వేల కేసులు

Published : Mar 27, 2021, 10:52 AM ISTUpdated : Mar 27, 2021, 11:06 AM IST
దేశంలో తీవ్రరూపం దాలుస్తున్న కరోనా.. ఒక్కరోజే 62వేల కేసులు

సారాంశం

నిన్న రికార్డు స్థాయిలో 50వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. నేడు అంతకు మించిన కేసులు నమోదవ్వడం గమనార్హం.

భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గి కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఊహించని రీతిలో పాజిటివ్ కేసులు భారీగా నమోదౌతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 50వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. నేడు అంతకు మించిన కేసులు నమోదవ్వడం గమనార్హం.

గత నాలుగు రోజుల్లో రెండు లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 కొత్తగా 62,258 కొవిడ్ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,19,08,910కు పెరిగింది. కొత్తగా 30,286 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,12,95,023 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 4,52,647 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో 291 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,61,240కు పెరిగింది. వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 5,81,09,773 డోసులు వేసినట్లు వివరించింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం