24 గంటల్లో 50 వేలకు చేరువలో కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 12,38,635కి చేరిక

By narsimha lodeFirst Published Jul 23, 2020, 10:55 AM IST
Highlights

దేశంలో గత 24 గంటల్లో 45, 720 కరోనా కేసులు  నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,38,635కి చేరుకొంది.ఒక్క రోజులోనే 1129 మంది మరణించినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 45, 720 కరోనా కేసులు  నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,38,635కి చేరుకొంది.ఒక్క రోజులోనే 1129 మంది మరణించినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి

దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి 7,82,606 మంది కోలుకొన్నారు. మరో వైపు 4,26, 167 యాక్టివ్ కేసులున్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనాతో దేశంలో మరణించినవారి సంఖ్య  29,861కి చేరుకొంది.

ఇప్పటివరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో 1,50,75,369 మంది నుండి శాంపిళ్లను సేకరించారు. బుధవారం నాడు ఒక్క రోజునే 3,50, 823 శాంపిళ్లను తీసుకొన్నట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది.

కరోనా బాలలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బాల్య అభివృద్ధిని మరింత దిగజార్చినట్టుగా యునిసెఫ్ ప్రకటించింది. ప్రపంచంలో 40 మిలియన్ల మంది పిల్లలు ప్రీ స్కూల్ ను కోల్పోయారని ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది.పిల్లల చదువుతో పాటు వారి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ తెలిపారు.

also read:కరోనా మరణాల్లో స్పెయిన్‌ను దాటిన ఇండియా: మొత్తం కేసులు 11,92,915కి చేరిక

కరోనాను నిరోధించే వ్యాక్సిన్ తయారీలో ప్రయోగాలు మంచి పురోగతిని సాధిస్తున్నట్టుగా పలు సంస్థలు ప్రకటించాయి. కొన్ని సంస్థల ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. 2021 ప్రారంభం నాటి వరకు వ్యాక్సిన్ వస్తోందని చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

లెహ్‌లోని డిహార్ ల్యాబ్ లో ఐసీఎంఆర్ భద్రతా ప్రమాణాలతో కరోనా పరీక్షల కేంద్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఈ నెల 22న ప్రారంభించారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 22న కొత్తగా 1554 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 9 మంది మరణించారు. రాష్ట్రంలో 49,259కి కరోనా కేసులు చేరుకొన్నాయి. ఇందులో 11,155 యాక్టివ్ కేసులని ప్రభుత్వం తెలిపింది. కరోనాతో ఇప్పటివరకు 438 మంది మరణించారు. 

కరోనా మరణాల్లో ప్రపంచంలోనే ఆరో స్థానానికి భారత్ చేరువగా నిలిచింది. ప్రస్తుతం 30 వేల మంది రోగుల మరణాలతో ఫ్రాన్స్ ఆరో స్థానంలో ఉంది. నిన్న స్పెయిన్ ను దాటి ఇండియా ఏడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
 

click me!