ఇండియాలో 68 రోజుల తర్వాత భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

By narsimha lodeFirst Published Jun 8, 2021, 9:51 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో 86,498 కేసులు నమోదయ్యాయి.68 రోజుల తర్వాత కొత్త కేసులు లక్షలోపు నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 4.62 శాతానికి పడిపోయింది. గత కొద్ది రోజులుగా కరోనా మరణాలు కూడ తగ్గుముఖం పడుతున్నాయి.
 

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో 86,498 కేసులు నమోదయ్యాయి.68 రోజుల తర్వాత కొత్త కేసులు లక్షలోపు నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 4.62 శాతానికి పడిపోయింది. గత కొద్ది రోజులుగా కరోనా మరణాలు కూడ తగ్గుముఖం పడుతున్నాయి.

గత 24 గంటల వ్యవధిలో 18,73,485 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 86,498 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది.మొత్తం కేసులు 2.89 కోట్లకు చేరాయి. ఏప్రిల్ ప్రారంభం నుండి నిత్యం లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా మరణాల సంఖ్య కూడ తగ్గుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 2123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3,51,309 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

సుమారు 26 రోజుల తర్వాత కరోనా రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 1,82,282 మందికి కోలుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 2,73,41,462 మంది కోలుకొన్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 13 లక్షలకు చేరుకొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4.50 శాతానికి తగ్గింది.


 

click me!