కోడలిని రూ. 80 వేలకు అమ్మేసిన మామ: 300 మహిళలతో వ్యాపారం

Published : Jun 08, 2021, 06:59 AM IST
కోడలిని రూ. 80 వేలకు అమ్మేసిన మామ: 300 మహిళలతో వ్యాపారం

సారాంశం

ఓ వ్యక్తి తన కోడలిని రూ.80 వేల రూపాయలకు విక్రయించాడు. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారబంకీ జిల్లా మల్లాపూర్ గ్రామంలో శనివారంనాడు దారుణమైన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన కోడలిని రూ.80 వేల రూపాయలకు విక్రయించాడు. అందుకు కొంత మందితో అతను ఒప్పందం చేసుకున్నాడు. గుజరాత్ కు చెందిన వ్యక్తులు ఆమెను కొనుగోలు చేసారు. 

ఆ విషయం తెలిసిన బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలిని తీసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధపడిన నిందితులను పోలీసులు రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బాధితురాలిని విడిపించారు 

మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు ప్రధాన నిందితుడైన బాధితురాలి మామా చంద్రరామ్, మరో నిందితుడు రామ్ గౌతమ్ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు 

వస్తువల క్రయవిక్రయాలు చేసినట్లుగానే చంద్రరామ్ మనుషులను కొన్ని అమ్ముతుంటాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు అతను 300 మంది మహిళలను కొనుగోలు చేసి వారిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించినట్లు తెలుస్తోంది. చంద్రరామ్ ఓ హత్య కేసులో నిందితుడు కూడా.

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport