విద్యార్థినిపై లైంగింకదాడి, అబార్షన్.. నిందితుడికి జంట యావజ్జీవ శిక్షలు...!

Published : May 07, 2021, 09:24 AM IST
విద్యార్థినిపై లైంగింకదాడి, అబార్షన్.. నిందితుడికి జంట యావజ్జీవ శిక్షలు...!

సారాంశం

విద్యార్థినికి అబార్షన్ చేయించిన ఓ యువకుడికి తమిళనాడు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పుదుక్కోలై సత్యమంగళం పసుంపొన్‌నగర్‌కు చెందిన సురేష్ (32). ఇతను అదే ప్రాంతానికి చెందిన ప్లస్ టూ చదివే విద్యార్థినికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.

అనేకసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం బైటికి తెలిస్తే ప్రమాదం అనుకున్న యువకుడు.. అబార్షన్ మాత్రలు కొని ఆ విద్యార్థినిచేత మింగించాడు. 

దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. అప్పుడు విషయం తెలిసిన విద్యార్థిని తల్లిదండ్రులు 9మార్చి 2019లో పుదుక్కోటై మహిళ పోలీస్ స్టేషన్ లో యువకుడిమీద ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సురేష్  మీద పోక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 

దీనిమీద పుదుక్కోటై మహిళ కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు సత్య సురేష్ కు లైంగికదాడి నేరానికి ఒక యావజ్జీవ శిక్ష, అబార్షన్ చేయించినందుకు మరో యావజ్జీవ శిక్ష అని.. జంట యావజ్జీవ శిక్షలను న్యాయమూర్తి ఖరారు చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?