మూడు నెలల తర్వాత 50వేలకు దిగువలో కరోనా: ఇండియా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు

By narsimha lodeFirst Published Jun 22, 2021, 9:28 AM IST
Highlights

న్యూఢిల్లీ:  ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 42,640 గా నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. దేశంలో కరోనా కేసులు ఈ ఏడాది మార్చి 19 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

 దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య  29,973,457కి చేరుకొన్నాయి.  కరోనాతో గత 24 గంటల్లో  1167 మంది మరణించారు. కరోనాతో మరణించిన సంఖ్య దేశంలో 3,89,268కి చేరింది.కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 7496 కేసులు, మహారాష్ట్రలో 6,270, తమిళనాడులో 7427, ఆంధ్రప్రదేశ్ లో  2,620న కర్ణాటకలో 4,867,  ఢిల్లలో 89, పశ్చిమబెంగాల్ లో 2,184 కరోనా ేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇప్పటివరకు 28,06,453, మహారాష్ట్రలో 59,72,781, తమిళనాడులో 24,22,497, ఆంధ్రప్రదేశ్ లో 18,50,563 కరోనా కేసులు  నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

దేశంలో చాలా రాష్ట్రాలు అన్‌లౌక్ దిశగా సాగుతున్నాయి. లాక్‌డౌన్ తో కరోనా కేసులు భారీగా తగ్గాయి.  అయితే అన్ లాక్ కారణంగా ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోకపోతే  కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఘర్డ్‌వూవ్ వస్తోందని  తేల్చి చెప్పారు

click me!