ఇండియాలో కరోనా జోరు: మొత్తం 23,703,665కి చేరిక

By narsimha lodeFirst Published May 13, 2021, 9:46 AM IST
Highlights

ఇండియాలో గత 24 గంటల్లో  3,62,727 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,703,665కి చేరుకొంది. కోవిడ్ కారణంగా ఒక్క రోజులోనే 4,120 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించిన రోగుల సంఖ్య2,58,317కి చేరుకొంది. 

న్యూఢిల్లీ:ఇండియాలో గత 24 గంటల్లో  3,62,727 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,703,665కి చేరుకొంది. కోవిడ్ కారణంగా ఒక్క రోజులోనే 4,120 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించిన రోగుల సంఖ్య2,58,317కి చేరుకొంది. 

మహారాష్ట్రలో ఒక్క రోజులో 46,781 కేసులు రికార్డయ్యాయి. మరో వైపు 920 మంది మరణించారు. కర్ణాటకలో 39,998 కరోనా కేసులు, కేరళలో 43,529, ఉత్తర్‌ప్రదేశ్ లో  18,125, తమిళనాడులో 30,355, ఆంధ్రప్రదేశ్ లో 21,452, పశ్చిమబెంగాల్ లో 20,377,ఢిల్లీలో 18,287 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

దేశంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు గాను  లాక్‌డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. కనీసం ఆరు వారాల పాటు లాక్‌డౌన్ విధించాలని సూచించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాక్షిక లేదా సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, వీకేండ్ లాక్‌డౌన్ లు అమల్లో ఉన్నాయి. లాక్‌డౌన్ విధించిన రాష్ట్రాల్లో  కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు.


 

click me!