Illegal Affair : ప్రియుడితో కలిసి భర్తను చంపి, ముక్కలు కోసి.. కెమికల్ తో వేసి.. ఓ భార్య దారుణం...!!

Published : Sep 21, 2021, 09:56 AM IST
Illegal Affair : ప్రియుడితో కలిసి భర్తను చంపి, ముక్కలు కోసి.. కెమికల్ తో వేసి.. ఓ భార్య దారుణం...!!

సారాంశం

ఆ తరువాత భర్త మృతదేహాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఎలా మాయం చేయాలా అని ఆలోచించింది. దానికోసం శవాన్ని ముక్కలుగా చేసి... ఆ ముక్కలను కెమికల్ లో వేసి కరిగించేందుకు ప్రయత్నించింది. దీంతో కెమికల్ వాడకంతో పేలుడు సంభవించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

ముజఫర్ పూర్ : బీహార్ లో ఓ మహిళ దారుణానికి తెగబడింది. వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తనే అతి దారుణంగా అంతమొందించింది. ప్రియుడితో కలిసి భర్తను చంపి, శవాన్ని ముక్కలుగా కోసి కెమికల్ లో వేసిందో భార్య. ఈ అత్యంత దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ నగర్ లో వెలుగు చూసింది. ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ ప్రాంతానికి చెందిన రాధ అనే వివాహిత తన ప్రియుడు సుభాష్, సోదరి రాధలతో కలిసి తన భర్త 30 యేళ్ల రాకేష్ ను హతమార్చింది.

ఆ తరువాత భర్త మృతదేహాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఎలా మాయం చేయాలా అని ఆలోచించింది. దానికోసం శవాన్ని ముక్కలుగా చేసి... ఆ ముక్కలను కెమికల్ లో వేసి కరిగించేందుకు ప్రయత్నించింది. దీంతో కెమికల్ వాడకంతో పేలుడు సంభవించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఫ్లాట్ లోపల చెల్లా చెదురుగా ఉన్న మృతదేహం ముక్కలు కనిపించాయి. వెంటనే పోలీసులు ఆ ముక్కలను సేకరించి పోస్ట్ మార్టం కోసం పంపారు. ఫొరెన్సిక్ బృందం దీనిమీద దర్యాప్తు ప్రారంభించింది. మృతదేహం రాధ భర్త రాకేష్ గా గుర్తించారు. 

బీహార్ లో రాకేష్ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడని, పోలీసుల భయంతో అతను ఇంటికి రావడం లేదని తేలింది. దీంతో అతని పార్ట్ నర్ సుభాష్.. రాకేష్ భార్యను చూసుకునేవాడని, దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

తీజ్, సందర్భంగా భర్త రాకేష్ ను ఇంటికి పిలిచిన భార్య ప్రియుడు, చెల్లెలు సహాయంతో చంపిందని పోలీసులు చెప్పారు. మృతుడి సోదరుడు దినేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu
భారీ వరదల తర్వాత నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి | Drone Visuals | Nepal Flash Floods | From Devi Ghat