బ్లాక్ మార్కెట్లోకి రెమిడెసివిర్.. మండిపోతున్న ధర

By telugu news teamFirst Published Jul 10, 2020, 10:23 AM IST
Highlights

ఔషధం అందుబాటులోకి వచ్చిందని నిబ్బరంగా ఉన్న కరోనా రోగులకు ఆ సంతోషం దూరమవుతోంది. బాధితుల ప్రాణాలను తమ జేబులు నింపుకునే ముడిసరుకుగా ఉపయోగించుకుని ఔషధం ధరను వేలకు వేలు పెంచేసి విక్రయిస్తున్నారు.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది అవస్థలు పడుతుండగా.. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ వైరస్ కి ఇప్పటివరకు పక్కాగా ఇదీ మందు అని ఎవరూ కనిపెట్టలేకపోయారు. అయితే.. ప్రస్తుతానికి మాత్రం దీనికి చికిత్సగా రెమిడెసివర్ ఔషదాన్ని వినియోగిస్తున్నారు.

అయితే.. ఇప్పుడు ఈ మందు బ్లాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఫలితంగా ఔషధం అందుబాటులోకి వచ్చిందని నిబ్బరంగా ఉన్న కరోనా రోగులకు ఆ సంతోషం దూరమవుతోంది. బాధితుల ప్రాణాలను తమ జేబులు నింపుకునే ముడిసరుకుగా ఉపయోగించుకుని ఔషధం ధరను వేలకు వేలు పెంచేసి విక్రయిస్తున్నారు.

బాధితుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దీని ధర కూడా పెరుగుతూ పోతుండడం గమనార్హం. ఢిల్లీ బ్లాక్ మార్కెట్లో నిన్న మొన్నటి వరకు దీని ధర రూ. 15 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ. 35 వేలకు చేరుకుంది. అక్రమార్కులు మందును భారీ మొత్తంలో ధరను పెంచి వారు సొమ్ము చేసుకుంటున్నారు.

ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని బ్లాక్ మార్కెట్లో మాత్రతమే రెమి‌డెసివిర్ అందుబాటులో  ఉండటం గమనార్హం. ఓ పక్క జనాలు కుప్పలు తెప్పలుగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పటికీ.. దానికి కూడా అక్రమార్కులు వ్యాపారం చేయాలనుకోవడం బాధాకరం. మరి దీనిపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకంటాయో చూడాలి. 

click me!