దేశంలో 56వేలు దాటిన కరోనా కేసులు, 24గంటల్లో 5వేల కేసులు

By telugu news team  |  First Published May 8, 2020, 9:59 AM IST

గత 24 గంటల్లో 5,000 వేల మంది వైరస్ బారినపడగా.. అత్యధికంగా మహారాష్ట్రలో 1,323 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 130 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 40 మంది, గుజరాత్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.


దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కేవలం 24గంటల్లో దేశవ్యాప్తంగా 5వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 56,300 దాటింది. వీరిలో 16,776 మంది కోలుకోగా.. 1,889 మంది మృత్యువాతపడ్డారు. మరో 37,916 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

 గత 24 గంటల్లో 5,000 వేల మంది వైరస్ బారినపడగా.. అత్యధికంగా మహారాష్ట్రలో 1,323 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 130 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 40 మంది, గుజరాత్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

Latest Videos

దేశంలోని మొత్తం మరణాల్లో 69.66 శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే సంభవించడం గమనార్హం. బుధవారంతో పోలిస్తే గురువారం నాటికి కేసుల సంఖ్యలో 7.20 శాతం, మరణాల్లో 5.25 శాతం, కోలుకున్నవారిలో 7.64 శాతం వృద్ధి నమోదైందని అధికారులు చెప్పారు. ఇప్పటివరకూ వైరస్‌ సోకినవారిలో 3.36% మంది మరణించగా, 28.83% మంది కోలుకున్నారు.

ఇదిలా ఉండగా.. కరోనా పై పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులు కూడా దాని బారిన పడుతున్నారు. మహారాష్ట్రలో ఏకంగా 531 మంది పోలీసులు కొవిడ్‌-19 బారిన పడ్డారు. వీరిలో 51 మంది అధికారులు, 480 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. 531 మందిలో 39 మంది కోలుకున్నట్లు అధికారులు చెప్పారు.

ముంబయిలో ఆర్థర్‌ రోడ్‌ జైలులో 72 మంది ఖైదీలు, ఏడుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు గురువారం నిర్ధారణ అయింది. దీంతో ఖైదీలను ముంబయిలోని జీటీ ఆసుపత్రి, సెయింట్‌ జార్జ్‌ ఆసుపత్రులకు తరలించారు. జైల్లోని వంట మనిషి ద్వారా వీరికి కరోనా సోకినట్లు సమాచారం.
 

click me!