భారత్ లో పెరుగుతున్న కరోనా.. నిన్న ఒక్కరోజే 7వేల కేసులు

By telugu news teamFirst Published May 29, 2020, 9:58 AM IST
Highlights

ఒక్కరోజే  మంది 200 మందికి పైగా ఈ కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం 89,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్యా లక్షా 50 వేలను దాటింది. గురువారం ఉదయం 8గంటల సమయానికి  1,65,799 కేసులు నమోదైనట్టు నేటి ఉదయం వరకు అందుబాటులో ఉన్న ఆరోగ్య శాఖ డేటా ద్వారా తెలియవస్తుంది. 

గత 24 గంటల్లో 7వేలకు పైగా కేసులు నమోదయినట్టు అధికారులు చెప్పారు. 

ఇప్పటివరకు 71,106మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా 4,706 మంది మరణించారని తెలియవస్తుంది.  ఒక్కరోజే  మంది 200 మందికి పైగా ఈ కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం 89,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 

ఝార్ఖండ్ లో నిన్న ఒక్కరోజే 32 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.,దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 458కి చేరుకుంది.

కాకపోతే ఇక్కడ ఒక ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే... రికవరీ రేట్. మార్చ్ లో 7.1 శాతంగా రికవరీ రేట్ ఉండగా అది నేడు 42.75 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్ మరణాల్లో కూడా గతంలో 3.3 శాతంగా ఉండగా అది  2.87 గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

కరోనా వైరస్ పట్ల సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండండని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.... కొందరి నిర్వాకం వల్ల మాత్రం ఈ వైరస్ వ్యాపిస్తునే ఉంది. 

ఇదిలా ఉండగా.. కోవిడ్ -19 పరీక్షను నిర్వహించడానికి ధరను తగ్గించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రైవేట్ ల్యాబ్‌లకు విజ్ఞప్తి చేసింది. 

ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆసుపత్రులలో పరీక్షలు చేయటానికి వేచి ఉన్న ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కోవిడ్ -19 పరీక్షకు ధరను తగ్గించాలని పిలుపునిస్తూ ఐసిఎంఆర్ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇదే విధమైన విజ్ఞప్తి చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 3వేలు దాటగా.. తెలంగాణ కూడా 3వేలకు చేరవలో ఉంది. గురువారం ఒక్కరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా కేసులు నమోదు కావడం బాధాకరం.

ప్రపంచవ్యాప్తంగా COVID-19 రోగుల సంఖ్య 57.4 లక్షలకు చేరుకోగా, మొత్తం మరణాల సంఖ్య 3,54,705 గా ఉందని వరల్డ్‌మీటర్స్ వెబ్‌సైట్ బుధవారం తెలిపింది.

click me!