భారత్ లో కరోనా విజృంభణ.. 12వేలకు చేరువలో మృతులు

By telugu news teamFirst Published Jun 17, 2020, 10:44 AM IST
Highlights

దేశంలో కరోనాబారినపడి కోలుకుంటున్నవారి శాతం పెరుగుతుండటం కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.79 శాతంగా వుంది

భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మూడున్నర లక్షలు దాటేశాయి. ఈ వార్త దేశ ప్రజలను మరింత కలవరపెడుతోంది.

గత 24గంటల్లో పదివేలకు పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా 12వేలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 3,54,065మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. కాగా.. 11,903 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. రికవరీ రేటు మాత్రం 52.79శాతం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

దేశంలో కరోనాబారినపడి కోలుకుంటున్నవారి శాతం పెరుగుతుండటం కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.79 శాతంగా వుంది. మరోవైపు కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ పైపైకి దూసుకెళ్తోంది. తాజా మరణాల సంఖ్యతో బెల్జియంను దాటి భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానానికి చేరింది. 

పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో వుంది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీల గుజరాత్, మధ్యప్రదేశ్ లలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలలోను కరోనా తీవ్ర ప్రతాపం చూపుతుంది.

ఇదిలా ఉండగా..ప్రపంచ కరోనా పరిస్థితులపై అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. జూలై 15 నాటికి భారత్ లో కరోనా తీవ్రస్థాయికి చేరుతుందని, అప్పటికి 8 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు.  అప్పటికి కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్ తర్వాత స్థానం భారత్ దే అవుతుందని వివరించారు.

130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కంటైన్మెంట్ నియమనిబంధనలు సడలించడం వల్ల భారత్ లో కరోనా రెక్కలు విప్పుకుని వ్యాపిస్తుందని తెలిపారు. భారత్ లో కరోనా విజృంభణ పీక్ స్టేజ్ కి చేరడానికి మరికొంత సమయం పడుతుందని మిచిగాన్ యూనివర్సిటీలో బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న భ్రమర్ ముఖర్జీ పేర్కొన్నారు. తాము దీర్ఘకాలిక ప్రాతిపదికన అంచనా వేసిన గణాంకాలు ఎంతో భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని, అందుకే వాటిని తమ వెబ్ సైట్ నుంచి తొలగించామని ఆమె వెల్లడించారు.

click me!