అల్లరి చేస్తున్నారని.. పిల్లలను నాల్గో అంతస్థు నుంచి పడేసి..

Published : Jun 17, 2020, 09:13 AM IST
అల్లరి చేస్తున్నారని.. పిల్లలను నాల్గో అంతస్థు నుంచి పడేసి..

సారాంశం

అపార్టుమెంటులోని 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి మరణించగా మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

అల్లరి చేస్తున్నారని ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను నాలుగో అంతస్థు నుంచి కిందకు విసిరేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగాల్ రాజధాని కలకత్తాలోని బుర్జా బజార్ ప్రాంతంలో 55సంవత్సరాల ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను అపార్టుమెంటులోని 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి మరణించగా మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా  చిన్నారులు అల్లరి చేస్తుండడం భరించలేకే వారిని  పైనుంచి కిందకు విసిరేశానని చెప్పుకొచ్చాడు. అయితే వారు మరణించాలని  తాను  విసిరేయలేదని, కేవలం కోపంతో వారిని పైనుంచి పడేశానని నిందితుడు వివరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System