ఫోన్‌లో భారత్- చైనా విదేశాంగ మంత్రుల చర్చలు: ఘర్షణలు ముందస్తు పథకమేనన్న జైశంకర్

By Siva KodatiFirst Published Jun 17, 2020, 7:01 PM IST
Highlights

చైనా ముందస్తు పథకమే ఘర్షణలు, ఇతర పరిణామాలకు మూలకారణమన్న కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అయితే భారత సైనికులే ఒప్పందాలు ఉల్లంఘించి దాడులు చేశారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఆరోపించారు

చైనా ముందస్తు పథకమే ఘర్షణలు, ఇతర పరిణామాలకు మూలకారణమన్న కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అయితే భారత సైనికులే ఒప్పందాలు ఉల్లంఘించి దాడులు చేశారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఆరోపించారు.

భారత సైనికులను శిక్షించాలని వాంగ్ కోరారు. జూన్ 6న కుదిరిన అవగాహన మేరకు దాడులకు పాల్పడకుండా సంయమనం పాటించాలని మంత్రి జయశంకర్ కోరారు. భారత్- చైనా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ, తదనంతరం పరిణామాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

గాల్వాన్‌లో హింసాత్మక ఘర్షణలు, జవాన్ల మృతిపై భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఈ సందర్భంగా తీవ్ర నిరసన తెలిపారు. గాల్వన్‌లో నిర్మాణాలకు చైనా ప్రయత్నించడమే వివాదాలకు కారణమన్నారు.

Also Read:అమరుడైన కల్నల్ సంతోష్ బాబు తల్లితో చెప్పిన చివరి మాటలు...

హింసకు దారి తీసేలా చైనా ప్రణాళిక ప్రకారమే దాడులకు దిగిందనీ.. తద్వారా అన్ని ఒప్పందాలు ఉల్లంఘించిందని అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు మార్చాలనే ఉద్దేశం చైనాలో కనబడుతోందని... జూన్ 6న మిలటరీ కమాండర్ స్థాయిలో డీఎస్కలేషన్ నిర్ణయం జరిగిందని జైశంకర్ అన్నారు.

ఈ మేరకు సైనికులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రోటోకాల్స్ తప్పకుండా పాటించాలన్నారు. చైనా అనుసరిస్తున్న ఇలాంటి అనుచితమైన వైఖరి ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని జైశంకర్ వ్యాఖ్యానించారు.

చైనా తన వైపు నుంచి చేపట్టిన కార్యకలాపాలపై పునరాలోచించుకోవాలని సూచించారు. మరోవైపు, చైనా తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలను ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి జైశంకర్‌కు వివరించారు.

Also Read:గాల్వన్ లోయ తమదే, ఘర్షణలో తమ తప్పు లేదు: చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు

ఈ ఘర్షణలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఫ్రంట్‌లైన్ దళాలను నియంత్రించాలని భారత్‌ను ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ సమస్యను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వెల్లడించిన కొద్దిసేపటి ఇరువురు నేతల మధ్య ఫోన్‌లో చర్చ జరిగింది.

జూన్ 6న తీసుకునన నిర్ణయం ప్రకారమే కట్టుబడి ఉండాలని, దాని ప్రకారం నడుచుకోవాలని ఇరు దేశాల మంత్రులూ తుది నిర్ణయానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రోటోకాల్ ఒప్పందాల ప్రకారం ఇరు పక్షాలు శాంతి నెలకొల్పేందుకు ఉమ్మడికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 

click me!