కరోనా వైరస్: రెట్టింపు రేటుకు చైనా కిట్లను కొన్న భారత్, ఎలా బయటపడిందంటే...

By Sree s  |  First Published Apr 27, 2020, 11:41 AM IST

చైనా కరోనా టెస్టింగ్ కిట్లకు సంబంధించి భారత్ లో దిగుమతి చేసుకునే కంపెనీకి భారత్ లో పంపిణీ చేసే కంపెనీకి మధ్య తలెత్తిన ఒక గొడవ వల్ల ఈ కిట్లను భారత దేశం రెట్టింపు కన్నా ఎక్కువ రేటుకు కొన్న విషయం బయటపడింది. 


కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఎక్కువ టెస్టులు చేయడమొక్కటే మార్గమని భావించిన ఐసిఎంఆర్ చైనా నుండి టెస్టింగ్ కిట్లను తెప్పించిన విషయం తెలిసిందే. 

తాజాగా ఈ చైనా కరోనా టెస్టింగ్ కిట్లకు సంబంధించి భారత్ లో దిగుమతి చేసుకునే కంపెనీకి భారత్ లో పంపిణీ చేసే కంపెనీకి మధ్య తలెత్తిన ఒక గొడవ వల్ల ఈ కిట్లను భారత దేశం రెట్టింపు కన్నా ఎక్కువ రేటుకు కొన్న విషయం బయటపడింది. 

Latest Videos

భారతదేశంలో ఈ టెస్టింగ్ కిట్ల పంపిణీదారు రియల్ మెటబోలిక్ కేంద్ర ప్రభుత్వానికి 60 శాతం అధిక రేటుకు ఒక్కో టెస్టు కిట్ ను విక్రయించింది. చైనా నుంచి దిగుమతి చేసుకునేప్పుడు మ్యాట్రిక్స్ అనే కంపెనీ కేవలం 245 రూపాయలను చెల్లిస్తే.... పంపిణీదారు రియల్ మెటబోలిక్ మాత్రం ప్రభుత్వానికి 60 శాతం అధిక ధర, 600 రూపాయలకు విక్రయించింది. 

ఈ విషయం అనుకోకుండా బయటపడింది. వివరాల్లోకి వెలితే... మ్యాట్రిక్స్ అనే సంస్థ చైనాలోని వాన్దాఫ్ కంపెనీ నుండి కిట్లను దిగుమతి చేస్తుంది. భారత ప్రభుత్వం రియల్ మెటబోలిక్ అనే పంపిణీదారు ద్వారా మ్యాట్రిక్స్  సంస్థ నుండి కిట్లను కొనుగోలు చేసింది. 

అయితే తమిళనాడు ప్రభుత్వం ఇదే మ్యాట్రిక్స్ సంస్థ నుండి షాన్ డిస్ట్రిబ్యూటర్స్ అనే పంపిణీదారు ద్వారా ఈ కిట్లను అదే 600 రూపాయలకు కొనుగోలు చేసింది. ఇలా షాన్ అనే పంపిణీదారు కూడా కొత్తగా ఎంటర్ అవడంతో రియల్ మెటబోలిక్ సంస్థ కోర్టుకెక్కింది. తామొక్కరమే అధీకృత పంపిణీదారులమని, ఇలా ఇప్పుడు కొత్తగా   షాన్ డిస్ట్రిబ్యూటర్స్ అనే పంపిణీదారును మధ్యలో తీసుకొచ్చి తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

ఇరు వర్గాలకు సంబంధించిన పేపర్లను చూసిన కోర్టు ఒక్కసారిగా అసలు దిగుమతి చేసుకున్న రేటును చూసి నివ్వెర పోయింది. ఈ కరోనా కష్ట కాలంలో ఇలా ఎక్కువ రేట్లకు విక్రయించడం సరికాదని వారిని మందలిస్తూ టెస్టింగ్ కిట్ల రేటు 400 రూపాయలు మాత్రమే ఉండాలని ఆదేశాలను జారీ చేసింది. 

ఈ కిట్లపై ఇప్పటికే రకరకాల ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో టెస్టు కిట్ల వాడకాన్ని రెండు రోజులపాటు నిలిపివేయాలని ఇదివరకే ఐసిఎంఆర్ ఆదేశాలను రాష్ట్రప్రభుత్వాలు జారీ చేసిన విషయం తెలిసిందే!

click me!