కోరలు చాస్తున్న కరోనా: స్పెయిన్ ను తోసిరాజేసి వైరస్ పీడిత 5వ దేశంగా భారత్

By Sree s  |  First Published Jun 7, 2020, 6:49 AM IST

భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. నిన్ననే కరోనా పీడిత టాప్ టెన్ దేశాల్లో ఆరవ స్థానానికి ఎగబాకిన భారత్... ఇప్పుడు తాజాగా 5వ స్థానంలో ఉన్న స్పెయిన్ ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించింది. 


భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. నిన్ననే కరోనా పీడిత టాప్ టెన్ దేశాల్లో ఆరవ స్థానానికి ఎగబాకిన భారత్... ఇప్పుడు తాజాగా 5వ స్థానంలో ఉన్న స్పెయిన్ ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించింది. 

2లక్షల 44 వేల పైచిలుకు కేసులు నమోదవడంతో భారత్... 2 లక్షల నలభైవేల కేసులు మాత్రమే ఉన్న స్పెయిన్ ను దాటివేసింది. ఇప్పుడు భారత దేశం కన్నా ఎక్కువ నమోదైన కేసులు కలిగిన దేశాలుగా అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే మాత్రమే ఉన్నాయి. 

Latest Videos

undefined

శనివారం ఉదయం ఆరోగ్యశాఖ డేటా ప్రకారం ఒక్కరోజే 9,887 కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 8గంటల వరకు ఉన్న డేటా ఆధారంగా గడిచిన 24 గంటల్లో 294 మంది  ఇప్పటివరకు భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 6,642కి చేరింది. 

నిన్ననే  ఆరవ స్థానానికి చేరిన భారత్, ఇప్పుడు మరో స్థానం ఎగబాకడం ఆందోళన కలిగిస్తున్న అంశం. భారతదేశంలో డిశ్చార్జ్ అవుతున్నవారు పెరుగుతున్నప్పటికీ.... ఇంకా కూడా లక్షకుపైగా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గతకొన్ని రోజులుగా రోజుకి 8,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఏకంగా దాదాపుగా 10వేల కేసులు నమోదయ్యాయి. 

మే 1వ తేదీ నాటికి కేవలం 9 రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్యా వేయి దాటితే... ఇప్పుడు దాదాపుగా 19 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య నాలుగంకెలను చేరుకుంది. ఇక మే 1వ తేదీనాటికి కేవలం మహారాష్ట్రలో మాత్రమే 5అంకెల కేసులు నమోదవగా, ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య 10,000 మార్కును దాటాయి. 

మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలలో కేసులు ఇప్పటికే 10,000 దాటగా... రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో కేసుల సంఖ్య 9 వెలను దాటాయి. చూడబోతుంటే కేవలం కొన్ని రోజుల్లోనే అవి కూడా ఆ పదివేల కేసుల క్లబ్ లో చేరే విధంగా కనబడుతున్నాయి.

మొత్తం కేసులు, యాక్టీవ్ కేసులు, మరణాలు, రికవరీలు, అన్నిట్లో కూడా మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా... ఆక్టివ్ కేసుల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. నమోదైన కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. మరణాల సంఖ్యలో గుజరాత్ రెండో స్థానంలో ఉండగా, ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. 

లాక్ డౌన్ సడలింపులు ప్రభుత్వం కల్పించడంతో ఈ కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంలోని మారుమూల గ్రామాలకు కూడా విస్తరిస్తుంది. ఇంతకుముందు మహానగరాలు, నగరాలకే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు అక్కడాఇక్కడా అని తేడా లేకుండా 

click me!