గద్వాల సీన్ రిపీట్: 13 గంటలు ఆసుపత్రుల చుట్టూ, అంబులెన్స్‌లోనే గర్భిణీ మృతి

By narsimha lode  |  First Published Jun 6, 2020, 9:09 PM IST

 తీవ్రమైన పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆసుపత్రిలో చేర్చుకొనేందుకు ఆసుపత్రులు ముందుకు రాకపోవడంతో 13 గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి అంబులెన్స్‌లోనే గర్భిణి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.


న్యూఢిల్లీ:  తీవ్రమైన పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆసుపత్రిలో చేర్చుకొనేందుకు ఆసుపత్రులు ముందుకు రాకపోవడంతో 13 గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి అంబులెన్స్‌లోనే గర్భిణి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

also read:గద్వాల గర్భిణి మృతి: క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన హైకోర్టు

Latest Videos

undefined

తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల గర్భిణీ తరహలోనే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో గర్భిణీని చేర్చుకొనేందుకు ఆసుపత్రులు ముందుకు రాకపోవడంతో అంబులెన్స్‌లోనే ఆమె మరణించింది.

యూపీ రాష్ట్రంలోని గౌతమ్‌బుద్దనగర్ జిల్లాలోని కోడా కాలనీకి చెందిన 30 ఏళ్ల నీలమ్, ఆమె భర్త విజేందర్ సింగ్ లు ఎనిమిది ఆసుపత్రుల చుట్టూ తిరిగారు.ఇందులో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడ ఉంది. 

నీలమ్ కు 8వ నెల. అయితే ఆమెకు అనుకోకుండా శుక్రవారం నాడు పురిటి నొప్పులు వచ్చాయి. భర్త విజేందర్ సింగ్ ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. 

తొలుత నీలం దంపతులు ఈఎస్ఐ  ఆసుపత్రి వద్దకు వెళ్లారు. ఆ తర్వాత సెక్టార్ 30 ఆసుపత్రికి చేరుకొన్నారు. అక్కడి నుండి శారద ఆసుపత్రికి చేరుకొన్నారు. అక్కడి నుండి ప్రభుత్వ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

ఎక్కడా కూడ ఆమెను అడ్మిట్ చేసుకొనేందుకు ఆసుపత్రివర్గాలు అంగీకరించలేదు. ఏదో ఒక కారణాన్ని చూపి తన భార్యను ఆసుపత్రిలో చేర్చుకోలేదని బాధితుడు విజేందర్ సింగ్ తెలిపారు.

13 గంటల పాటు అంబులెన్స్ లో ఆసుపత్రుల చుట్టూ భార్యను తిప్పాడు. చివరకు జిమ్స్ ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే ఆసుపత్రిలో చేర్పించే సమయానికి అంబులెన్స్ లోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.ఆసుపత్రిలో చేరిన ఆమెను పరీక్షించిన వైద్యులు మరణించినట్టుగా ప్రకటించారు. ఈ విషయమై ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ వీడియో పలువురిని కంటతడిపెట్టిస్తోంది. ఈ ఘటనపై గౌతం బుద్దనగర్ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్ వై విచారణకు ఆదేశించారు.
అడిషనల్ డీఎం మునీంద్ర నాథ్ ఉపాధ్యాయ్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ దీపక్ ఓరిలు ఈ విషయమై విచారణ నిర్వహించనున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు. 
 

click me!