వివాదాస్పదం: జిన్నా ప్రధానైతే ఇండియా రెండు ముక్కలయ్యేది కాదు: దలైలామా

First Published Aug 8, 2018, 6:30 PM IST
Highlights

మహ్మద్ అలీ జిన్నా ఇండియాకు ప్రధానమంత్రిగా అయి ఉంటే అవిభాజ్య భారత్ విడిపోయేది కాదని  బౌద్ద గురువు దలాలైమా అభిప్రాయపడ్డారు.  గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో బుధవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

పనాజీ:మహ్మద్ అలీ జిన్నా ఇండియాకు ప్రధానమంత్రిగా అయి ఉంటే అవిభాజ్య భారత్ విడిపోయేది కాదని  బౌద్ద గురువు దలాలైమా అభిప్రాయపడ్డారు.  గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో బుధవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక తప్పును చేస్తారని ఆయన చెప్పారు.  తప్పులు చేయడంలో భారత మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కూడ అతీతుడు కాదన్నారు. జీవితంలో తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని ఓ విద్యార్థి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయాలని మహాత్మాగాంధీ భావించారని  దలాలైమా గుర్తు చేసుకొన్నారు. కానీ, జిన్నాను ప్రధాని చేయడానికి నెహ్రు ఒప్పుకోలేదని  ఆయన చెప్పారు.  తానే ప్రధాని కావాలని నెహ్రు పట్టుబట్టారని  ఆయన చెప్పారు. 

ఆనాడు నెహ్రు ఆ తప్పు చేసి ఉండకపోతే జిన్నా ఇండియాకు ప్రధానమంత్రి అయి ఉండేవాడని దలాలైమా చెప్పారు.జిన్నా ప్రధానమంత్రి అయితే భారతదేశం రెండు ముక్కలుగా విడిపోయేది కాదన్నారు. తప్పులు జరగడం సహజమన్నారు.

click me!