BJP MP Meenakshi Lekhi: "సీమాంతర ఉగ్రవాదానికి భారత్ కూడా బాధితురాలే"

Published : May 11, 2022, 03:16 AM IST
BJP MP Meenakshi Lekhi: "సీమాంతర ఉగ్రవాదానికి భారత్ కూడా బాధితురాలే"

సారాంశం

BJP MP Meenakshi Lekhi: ఉగ్రవాదంపై అంతర్జాతీయ చట్టాన్ని పటిష్టం చేయాలి, స్పెయిన్‌లో మానవ హక్కులు-ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై అంతర్జాతీయ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని, తద్వారా ఉగ్రవాదాన్ని నిర్మూలించ‌వ‌చ్చ‌ని మీనాక్షి లేఖి అన్నారు.  

BJP MP Meenakshi Lekhi: సీమాంతర ఉగ్రవాదానికి భారత్ బలి అయిందని పాకిస్థాన్‌పై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మంగళవారం మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిని, అది మళ్లీ తీవ్రవాద స్వర్గధామంగా ఎలా మారుతుందో ఆమె వివ‌రించారు. స్పెయిన్‌లోని మ‌లాగాలో జరిగిన  మానవ హక్కులు, పౌర సమాజం మరియు ఉగ్రవాద నిరోధకంపై అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సదస్సులో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగ్రవాద బాధితులకు, వారి కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉగ్రవాదం అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదానికి, ముఖ్యంగా సరిహద్దు ఉగ్రవాదానికి బలి అవుతుందని మీనాక్షి లేఖి అన్నారు. ఈ సమయంలో,  ఆమె UN నియమించిన ఉగ్రవాద గ్రూపులు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైష్-ఎ-మహ్మద్ మరియు దాని అనుబంధ గ్రూపులను గురించి ప్రస్తావించాడు.

 "2001 లో పార్లమెంటు దాడి, 2005లో ఢిల్లీ బాంబు దాడులు, 2008లో ముంబై, 2016లో పఠాన్‌కోట్, ఉరీ ఉగ్ర‌వాదులు, 2019లో పుల్వామా ఉగ్రదాడుల భయానక జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి. అయితే ఈ భయంకరమైన ఉగ్రవాద దాడులలో బాధితులు ఇంకా చాలా మంది మిగిలి ఉండటం విచారకరం. ”అని ఆమె పేర్కొన్నారు. 

పాకిస్తాన్ అనుస‌రిస్తున్న‌ ద్వంద్వ ప్రమాణాలను అంతర్జాతీయ సమాజం నుండి నిస్సందేహంగా ఖండించాల్సిన అవసరం ఉందని, ప్రత్యేకించి ఉగ్రవాదానికి సాధనంగా ఉపయోగించినప్పుడు వేటు వేయాల‌ని తెలిపారు. 


ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుతూ, తాలిబాన్ పాలనలో ఉన్న దేశమ‌నీ, మరోసారి అల్-ఖైదా, ఐఎస్‌ఐఎల్, లష్కరే తోయిబా,  జైష్ వంటి UN నియమించిన అనేక ఇతర ఉగ్రవాద గ్రూపులకు సురక్షితమైన స్వర్గధామంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై అంతర్జాతీయ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని, తద్వారా ఉగ్రవాదాన్ని నిర్మూలించ‌వ‌చ్చ‌ని మీనాక్షి లేఖి అన్నారు.  

మీనాక్షి లేఖి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో ఇంధన సంక్షోభంపై చర్చించారు. అంతకుముందు, మీనాక్షి లేఖి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ ప్రెసిడెంట్ అబ్దుల్లా షాహిద్‌తో ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార మరియు ఇంధన సంక్షోభంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై చర్చించారు. ఈ మేరకు లేఖి ట్విట్టర్‌లో సమాచారం అందించారు. దక్షిణ అమెరికా దేశమైన చిలీని సందర్శించిన తర్వాత న్యూయార్క్ చేరుకున్న లేఖి శుక్రవారం ట్వీట్ చేస్తూ, “ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్‌తో అద్భుతమైన సమావేశం.అని పేర్కొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్