తరతరాలుగా ఆ దుర్గా ఆలయంలో ముస్లింలే పూజారులు.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందంటే.. ?

By Asianet News  |  First Published Apr 17, 2023, 8:02 PM IST

రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోని ఓ మారుమూల కొండపై ఉన్న 600 ఏళ్ల నాటి దుర్గామాత ఆలయం. ఆ ఆలయం మిగితా దేవాలయాలతో పోల్చితే.. చాలా ప్రత్యేకం..  ఆ ఆలయం పూజారి ముస్లిం. ఆ ఆ ఆలయ చరిత్ర ఎంటో తెలుసుకోవాలంటే.. ఈ సోర్టీ తప్పక చదవాల్సిందే..  


భారతీయ సంస్కృతికి దేవాలయాలు కేంద్రబిందువులు. ఆలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమం మన సంస్కృతికి అద్దం పడుతాయి. ఇక దేవీ లేదా దేవత ఆలయాలకు మరింత ప్రత్యేక స్థానం ఉంటుంది. నవరాత్రుల్లో దుర్గామాత ఆలయాల్లో మత విశ్వాసాలు వెల్లివిరుస్తున్నాయి. అటువంటి విశ్వాసంతో ముడిపడి ఉన్న ఆలయాల్లో.. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోని ఓ మారుమూల కొండపై ఉన్న 600 ఏళ్ల నాటి దుర్గామాత ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం.. ఈ  ఆలయం గురించి తెలిస్తే .. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే .. ఈ దుర్గ గుడిలో పూజారి ముస్లిం. ముస్లిం వ్యక్తి  పూజారిగా పని చేయడమేంటని అనుకుంటున్నారా..? అదే ఈ పురాతన దేవాలయం ప్రత్యేకత. 

మన సమాజంలో మతం ,కులానికి సంబంధించి వివిధ నియమాలు, నిబంధనలు ఉండవచ్చు. అయినప్పటికీ.. కొంతమంది దీనికి భిన్నంగా నిలబడి ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలుస్తారు.  మత సామరస్యం, మాతృ దేవత పట్ల భక్తితో ముడిపడి ఉన్న అలాంటి ఆలయం ఒకటి తెరపైకి వచ్చింది. దుర్గా ఆలయంలో ముస్లిం పూజారి మాతృ దేవతను పూజిస్తారు. ఆ ముస్లిం పూజారి గొప్ప దేవి భక్తుడు కూడా.

Latest Videos

undefined

తరతరాలుగా ముస్లింలే పూజారులు  

వివరాల్లోకెళ్తే.. జోధ్‌పూర్ జిల్లాలోని అటవీ ప్రాంతమైన భోపాల్‌ఘర్‌లో బగోరియా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని ఎత్తైన కొండలపై ఉన్న పురాతన దుర్గా ఆలయం ఉంది. బగోరియా గ్రామంలోని ఎత్తైన కొండపై ఏర్పాటు చేసిన దుర్గా ఆలయానికి చేరుకోవడానికి భక్తులు సుమారు 500 మెట్లు , 11 విజయ్ పోల్స్ దాటితే.. దుర్గాదేవిని  దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే.. ఈ ఆలయంలో  తరతరాలుగా ముస్లిం కుటుంబాలు పూజారులుగా వ్యవహరిస్తూ.. దేవతకు ఆరాధిస్తున్నారు. బగోరియాలోని దుర్గాదేవి ఆలయంలో ప్రస్తుతం జలాలుద్దీన్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి పూజారిగా ఉన్నారు. ఈ దుర్గా దేవాలయంలోని ముస్లిం పూజారి కుటుంబం ..దేవి నవరాత్రుల్లో ఉపవాస దీక్షలు చేస్తూ.. అమ్మవారిని పూజిస్తారు. ఈ కుటుంబంలోని వారే తరతరాలుగా పూజరులుగా ఉంటున్నారు.  నవరాత్రుల సమయంలో అమ్మవారి భక్తుడైన ప్రధాన పూజారి ఆలయ ప్రాంగణంలో ఉంటూ.. ఉపవాస దీక్షలు ,భజనలు చేస్తుంటారు. మాతాను పూజిస్తారు.  

అద్భుతాన్ని చూసి .. అక్కడే స్థిర పడి..  

వందల సంవత్సరాల క్రితం సింధ్ ప్రావిన్స్‌లో తీవ్రమైన కరువు వచ్చింది. దీంతో ఆ ప్రాంతంతో నివసించే.. జలాలుద్దీన్ ఖాన్  పూర్వీకులు మరో ప్రాంతానికి వలస వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో అతని పూర్వీకులు ఒంటెల కాన్వాయ్‌తో మాల్వాకు చేరుకున్నారట. అయితే.. దారిలో కొన్ని ఒంటెలు అస్వస్థతకు గురయ్యాయి. ఈ క్రమంలో తన పూర్వీకులకు రాత్రిపూట కలలో దేవి కనిపించి.. సమీపంలోని మెట్ల బావిలో ఉన్న దేవి విగ్రహాన్ని బయటకు తీసి.. అందులోని  నీటిని ఒంటెలకు తాగిస్తే.. వాటి రోగం తగుతుందని ఆకాశవాణి చెప్పిందట.

ఆ దేవత చెప్పినట్టుగా.. జమాలుద్దీన్ ఖాన్ పూర్వీకులు చేశారట. దీంతో ఒంటెల రోగం పూర్తిగా  నయం అయిందనీ.. మన జీవితంలో జరిగిన ఓ అద్భుతంగా జలాలుద్దీన్ ఖాన్  అభివర్ణించారు. ఈ అద్భుతాన్ని చూసిన  ఖాన్  పూర్వీకులు ఈ గ్రామంలో ఉండాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి వారు ఇక్కడ స్థిరపడి.. మాతృ దేవతను పూజించడం ప్రారంభించారు. జలాలుద్దీన్ ఖాన్  కుటుంబ సభ్యులు తరతరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఈ రోజు వరకు కూడా ఈ ఆలయంలో ముస్లింలే పూజారులుగా మారారు. మాతను పూజిస్తున్నారు. 

click me!