పెరుగుతున్న ఇన్ ఫ్లూయెంజా కేసులు.. కోవిడ్-19తో సంబంధ‌ముందా? వైద్య‌నిపుణులు ఏమంటున్నారంటే..?

Published : Mar 07, 2023, 10:07 AM IST
పెరుగుతున్న ఇన్ ఫ్లూయెంజా కేసులు.. కోవిడ్-19తో సంబంధ‌ముందా?  వైద్య‌నిపుణులు ఏమంటున్నారంటే..?

సారాంశం

New Delhi: భారతదేశం అంతటా అధిక సంఖ్యలో జ్వరం, ఫ్లూ కేసుల పెరుగుద‌ల క‌నిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా గ‌త రెండు మూడు నెల‌లుగా ఫ్లూ (ఇన్ ఫ్లూయెంజా) కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయ‌ని వైద్య రిపోర్టులు పేర్కొంటున్నాయి.  (ఇన్ ఫ్లూయెంజా) లక్షణాలు సాధారణంగా జ్వరంతో పాటు నిరంతర దగ్గును కలిగి ఉంటాయ‌ని పేర్కొంటున్న వైద్యులు.. ఇటీవలి కాలంలో చాలా మంది రోగులు దీర్ఘకాలిక లక్షణాల గురించి చెబుతున్నార‌ని వెల్ల‌డించారు.  

H3N2 influenza: కోవిడ్-19 సహ ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా కేసుల ధోరణి పెరగడంపై ఆరోగ్య అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్లూ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రుల‌తో చేరుతున్న వారి సంఖ్య అధికంకావ‌డం, ఇదే స‌మ‌యంలో ఐసీయూలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నందున పరీక్షలు పెంచాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశం అంతటా అధిక సంఖ్యలో జ్వరం, ఫ్లూ కేసుల పెరుగుద‌ల క‌నిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా గ‌త రెండు మూడు నెల‌లుగా ఫ్లూ (ఇన్ ఫ్లూయెంజా) కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయ‌ని వైద్య రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, క‌రోనా వైర‌స్, ఇన్ ఫ్లూయెంజా కు ఏదైనా సంబంధం ఉందా అనే చ‌ర్చ మొద‌లైంది. ఇదే విష‌యంపై వైద్య నిపుణులు, ప‌లువురు ప‌రిశోధ‌కులు మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

కోవిడ్ -19, ఇన్ ఫ్లూయెంజా రెండూ ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉన్నాయనీ, అవి రెండు నుండి మూడు నెలలు ఉండవచ్చున‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ రెండింటి వ్యాప్తి పెరుగుద‌ల ఆందోళ‌న క‌లిగించే విష‌యమ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇన్ ఫ్లూయెంజా అనుమానిత రోగుల నమూనాలను కోవిడ్ -19 కోసం కూడా పరీక్షిస్తున్నామని ఆరోగ్య శాఖ‌కు చెందిన‌ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఎడ్యుకేషన్ చైర్మన్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, హెచ్ 1 ఎన్ 1 వైరస్ ఉత్పరివర్తన అయిన హెచ్3 ఎన్2 వైరస్ ప్రతి సంవత్సరం ఈ సమయంలో వ్యాప్తి చెందుతుందని చెప్పారు. వాటి మ్యుటేషన్ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోంద‌ని పేర్కొన్నారు. 

"వాతావరణం మారుతున్న ఈ సమయంలో ఇన్ ఫ్లూయెంజా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ, ఇప్పుడు మాస్కులు ధరించని నాన్ కోవిడ్ స్థితికి తిరిగి వచ్చాం. కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కోవిడ్-19 త‌ర‌హా ఆంక్ష‌లు లేక‌పోవ‌డం.. జనం ఎక్కువగా గుమిగూడుతుండ‌టం వ‌ల్ల  వైరస్ మరింత సులభంగా వ్యాప్తి చెందుతుంది" అని గులేరియా పేర్కొన్నారు.

అయితే, కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కోవిడ్ పరీక్షల సంఖ్యను దామాషా ప్రకారం పెంచాలని గులేరియా  సిఫార్సు చేశారు. నిఘా, పరీక్షలను పెంచాలని ప్రభుత్వం వెంటనే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ను ఆదేశించాలని తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) దేశవ్యాప్తంగా 30 వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుద‌ల‌పై నిఘాను ఉంచుతూ ప‌రిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు విశ్లేష‌ణ‌లు జ‌రుపుతున్న‌ద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఐసీయూలో చేరిన హెచ్3ఎన్2 కేసులతో పాటు అడెనోవైరస్, పారా ఇన్ఫ్లూయెంజా, కరోనా ఇన్ఫెక్షన్లు ఉన్న రోగులు ఇన్ఫ్లుఎంజాకు వ్యతిరేకంగా టీకాలు వేసినప్పటికీ కొత్త కేసులు క‌నిపిస్తున్నాయ‌ని ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రి సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు.

ప్ర‌స్తుతం అధికంగా వ్యాపిస్తున్న ఫ్లూ (ఇన్ ఫ్లూయెంజా) ఏ-సబ్టైప్ హెచ్ 3 ఎన్ 2 (A subtype H3N2) కారణంగా వచ్చే ఫ్లూ ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా ఆసుపత్రిలో చేరడానికి కారణమవుతుందని  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. హెచ్ 3 ఎన్ 2 వైరస్ ఇతర ఇన్ ఫ్లూయెంజా ఉప రకాల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, కొత్త ర‌కం ఇన్ ఫ్లూయెంజా ప్రాణాంతకం కాదని క్లినికల్ ట్రయల్ స్పెషలిస్ట్ డాక్టర్ అనితా రమేష్ చెప్పిన‌ట్టు మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 'ఇది ప్రాణాంతకం కాదు. కానీ కొంతమంది రోగులు శ్వాసకోశ సమస్యల కారణంగా అడ్మిట్ కావాల్సి వ‌స్తుంది. కొన్ని లక్షణాలు కోవిడ్ ను పోలి ఉంటాయి' అని ఆయ‌న చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !