ఓటుకు నోటుకు కేసు: కోర్టులో ఐటీ శాఖ నివేదిక

By narsimha lodeFirst Published Jan 11, 2019, 5:54 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లకు నగదును పంపినీ చేసిన కేసులో  ఐటీ శాఖ హైకోర్టులో నివేదికను సమర్పించింది. జయలలిత మృతితో ఖాళీ అయిన అర్కే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలను  నిర్వహించిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ:  తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లకు నగదును పంపినీ చేసిన కేసులో  ఐటీ శాఖ హైకోర్టులో నివేదికను సమర్పించింది. జయలలిత మృతితో ఖాళీ అయిన అర్కే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలను  నిర్వహించిన విషయం తెలిసిందే.

 జయలలిత మృతి కారణంగా  ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా దినకరన్  భారీగా ఓటర్లకు నగదును పంచారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నగదు, కీలకమైన పత్రాలు కూడ స్వాధీనం చేసుకొన్నారు.

దీంతో  ఈ ఎన్నికను తొలుత ప్రకటించిన తేదీ  నిర్వహించకుండా వాయిదా వేసింది.  ఓటర్లకు నగదు పంపిణీ వ్యవహారంపై ఐటీ శాఖ పోలీసులకు ఫఇర్యాదు చేసింది. ఇదిలా ఉంటే ఓటర్లకు నోట్లు పంపిణీ విషయమై డీఎంకె సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ విషయమై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ సమయంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఐటీ శాఖకు న్యాయమూర్తులు ఎం.సత్యనారాయణన్, పి. రాజమాణిక్కం ఆదేశించారు. ఐటీ శాఖ ప్రిన్సిఫల్ కమిషనర్ పి. మురళీ కుమార్ కోర్టుకు హాజరై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 

ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓటర్లకు నగదును పంపిణీ చేశారనేందుకు ఆధారాలు లభించాయని ఐటీ కమిషనర్  చెప్పారు. పలువురి ఇళ్లలో పెద్ద ఎత్తున  నగదును స్వాధీనం చేసుకొన్నట్టు  ఐటీ కమిషనర్  ఈ అఫిడవిట్‌లో  కోర్టుకు తెలిపారు. వీరి నుండి సుమారు రూ. 2.95 కోట్లను  స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో 2017 ఏప్రిల్ 9వ తేదీన ఇచ్చినట్టు  ఆయన ఆ ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. 


 

click me!