ఇది మామూలు పెళ్లి కాదు... ఎన్నికల పెళ్లి

By telugu teamFirst Published Apr 16, 2019, 11:22 AM IST
Highlights

సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు... వధువును జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని, తన ప్రాణం పోయేంత వరకు కలిసి ఉంటానని ఇలా వాగ్దానాలు చేస్తుంటారు. ఇది  చాలా కామన్ గా జరిగేదే.

సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు... వధువును జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని, తన ప్రాణం పోయేంత వరకు కలిసి ఉంటానని ఇలా వాగ్దానాలు చేస్తుంటారు. ఇది  చాలా కామన్ గా జరిగేదే. అయితే.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ జంట మాత్రం వినూత్నంగా వివాహం చేసుకుంది. ఇది పెళ్లా.. ఎన్నికల ప్రచారమా అన్న అనుమానం అందరిలోనూ కలిగింది.

పెళ్లి మండపం మొదలుకొని మహిళల అలంకరణ వరకూ అంతటా 100శాతం ఓటింగ్ జరగాలనే నినాదం రాసి ఉంది. వధూవరులు వేసిన ఏడడుగుల్లో ఎనిమిది ప్రమాణాలు కూడా ఎన్నికలకు సంబంధించినదే కావడం విశేషం. 

తమ జీవితంలో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేస్తామనేది వారి ఎనిమిదవ ప్రమాణంగా నిలిచింది. దీంతో ఈ పెళ్లి ఛత్తీస్‌గఢ్‌లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే బాలోద్ పరిధిలోని హల్దీ గ్రామంలో మనీష్ సాహూకు తేజేశ్వరితో వివాహం జరిగింది. వీరిద్దరూ ఒకేచోట పీజీ చేశారు. ప్రస్తుతం తేజేశ్వరి కుట్టుపని చేస్తుండగా, మనీష్ ట్రాక్టర్ కంపెనీలో పని చేస్తున్నాడు. పెళ్లి వేడుకల్లో వీరిద్దరూ దండలు మార్చుకునే సమయంలో పోస్టర్లు వేసుకున్నారు. దానిపై పెళ్లికి వచ్చినవారంతా తప్పనిసరిగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని రాశారు.
 

click me!