బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు విద్యారాణి

Published : Feb 23, 2020, 09:17 AM IST
బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు విద్యారాణి

సారాంశం

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి బీజేపీలో చేరారు..

చెన్నై: పోలీసుల ఆపరేషన్‌లో మరణించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు  విద్యారాణి బీజేపీలో చేరారు. 

శనివారం నాడు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాజీ కేంద్రమంత్రి రాధాకృష్ణన్ సమక్షంలో శనివారం నాడు ఆమె బిజెపిలో చేరారు.ఆమె బీజేపీలో ఎందుకు చేరారనే విషయమై మీడియా ప్రశ్నలకు మాత్రం ఆమె సమాధానాన్ని దాటవేశారు. 

క్రిస్టియనన్ మతానికి చెందిన మరియా దీపక్ తో ఆమె గతంలో ప్రేమ పెళ్లి చేసుకొన్నారు. ఈ సమయంలో ఆమె వార్తల్లో నిలిచారు. ఈ పెళ్లిని విద్యారాణి తల్లి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో చేరడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. 

గిరిజనుల్లో తమ పట్టును పెంచుకొనేందుకు బీజేపీ ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ క్రమంలోనే వీరప్పన్ కూతురును బీజేపీలో చేర్చుకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు కమలదళం ప్రయత్నాలను చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకత్వం ఆయా ప్రాంతాల్లో  పట్టున్నవారిని తమ పార్టీలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే వీరప్పన్ కూతురును పార్టీలో చేర్చుకొన్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Pension Scheme : అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 7 పొదుపు చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ !
V2V Technology : ఇక యాక్సిడెంట్లు ఉండవ్.. కార్లే డ్రైవర్లను అలర్ట్ చేస్తాయి ! ఏమిటీ V2V టెక్నాలజీ?