గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి, నలుగురికి గాయాలు

Published : Feb 23, 2020, 07:25 AM ISTUpdated : Feb 23, 2020, 08:40 AM IST
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి, నలుగురికి గాయాలు

సారాంశం

గుజరాత్ లో శనివారం నాడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.


గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో శనివారం నాడు రాత్రి చోటు చేసుకొన్న రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
వడోదర జిల్లాలోని పాద్రా తాలుకా పరిధిలో మహావుద్ గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

Also read:తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి, 20 మందికి గాయాలు

ఓ పెళ్లి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకు వెళ్లి వస్తున్న టెంపోను  ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలోనే ఏడుగురు మృతి చెందారు. క్షతగాత్రులను వడోదరలోని ఎస్ఎస్ జీ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు.

విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

టార్గెట్ 2035 .. ఈ రాష్ట్రంలో మురుగునీరే ఉండదట
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు