కొబ్బరి తురిమే పీటతో దాడిచేసి.. అత్తామామల్ని హతమార్చిన కోడలు..

Bukka Sumabala   | Asianet News
Published : Nov 02, 2020, 10:02 AM IST
కొబ్బరి తురిమే పీటతో దాడిచేసి.. అత్తామామల్ని హతమార్చిన కోడలు..

సారాంశం

చిన్న విషయానికే భర్త, అత్తమామలతో గొడవ పడిన ఓ కోడలు వారిని దారుణంగా హతమార్చిన ఘటన బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెడితే మైసూరు జిల్లా కేఆర్ పేట హెమ్మడహళ్లికి చెందిన నాగమణి కొబ్బరి తురిమే పీటతో కొట్టి భర్త నాగరాజు, మామ వెంకటేశ్ గౌడ, అత్త కుళ్లమ్మలను హతమార్చింది. 

నాగమణి ప్రతి చిన్న విషయానికి భర్త, ఇతరు కుటుంబ సభ్యులుతో గొడవపడేదని, అలా పదిహేను రోజుల క్రితం కూడా గొడవపెట్టుకుని  కొబ్బరి తురిమేపీటతో అత్తమామలపై దాడి చేసింది. అడ్డుకోవడానికి వచ్చిన భర్తనూ కొట్టింది. నాగమణి దాడిలో తీవ్రగా గాయపడిన ముగ్గురినీ కేఆర్ పేట ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. 

తీవ్రంగా గాయాలైన నాగరాజు చికిత్స పొందుతూ గతవారం మృతి చెందాడు. చావు బతువులతో పోరాటం చేసిన ఆమె అత్తామామలు శనివారం రాత్రి చనిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

నాగరాజు దంపతులకు 18,20 యేళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. నిందితురాలిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కారాగారానికి పంపారు. కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారితో ఆమె గొడవ పడుతుండేదని, పెద్దలు పలుమార్లు రాజీ చేసినా, ామె తీరు మార్చుకోలేదని స్థానికులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే