రజినీకాంత్ తో గురుమూర్తి భేటీ: మంతనాల రహస్యం ఇదేనా?

By telugu teamFirst Published Nov 2, 2020, 9:53 AM IST
Highlights

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి భేటీ కావడంతో రాజకీయాల్లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజకీయాల్లోకి ప్రవేశించవద్దని వైద్యులు చెప్పినట్లు రజినీకాంత్ చెప్పిన విషయం తెలిసిందే.

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో రాజకీయ వ్యాఖ్యాత, తమిళ పత్రిక తుగ్లక్ సంపాదకుడు ఎస్ గురుమూర్తి ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇరువురి మధ్య రెండు గంటల పాటు మంతనాలు జరిగాయి.

రజినీకాంత్ ను గురుమూర్తి మర్యాదపూర్వకంగానే కలిశారని, ఆరోగ్యం గురించి కనుక్కోవడానికి మాత్రమే కలిశారని చెబుతున్నప్పటికీ మీడియా మాత్రం ఊహాగానాలు చేస్తోంది. వారిద్దరి మధ్య భేటీ జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజకీయ ఊహాగానాలు చేస్తోంది. 

రజినీకాంత్ కు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని, బిజెపితో రజినీకాంత్ కలిస్తే బాగుంటందని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అయిన గురుమూర్తి గతంలో అన్నారు. మూత్రపిండాల మార్పిడి జరిగిన నేపథ్యంలో రాజకీయాల్లోకి దిగడం సరి కాదని వైద్యులు చెప్పినట్లు రజినీకాంత్ తెలిపిన విషయం తెలిసిందే. 

అయినప్పటికీ తాను రజినీ మక్కల్ మంద్రం ఆఫీస్ బియరర్లను సంప్రదించి రాజకీయాల్లోకి రావాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తన ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచనపై పునరాలోచన చేస్తానని రజినీకాంత్ ట్విట్టర్ వేదిక చెప్పారు. 

తమిళనాడు శాసనసభ ఎన్నికలు 2021లో జరుగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ నెలకొంది. తాను క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించలేని పరిస్థితిలో రజినీకాంత్ బిజెపికి మద్దతు ఇస్తారా అనే విషయంపై కూడా చర్చ సాగుతోంది. గురుమూర్తి భేటీ అందుకే జరిగిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

click me!