డ్రైవింగ్ చేస్తుండగానే బైక్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న రైడర్

Published : Jun 02, 2022, 03:55 PM IST
డ్రైవింగ్ చేస్తుండగానే బైక్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న రైడర్

సారాంశం

బైక్‌లో మంటలు వస్తున్న ఘటనలను ఇటీవలి కాలంలో తరుచూ చూస్తున్నాం. మొన్నటి వరకు ఎలక్ట్రానిక్ వాహనాల్లో మంటలు రావడం, పేలిపోవడం వంటి దుర్ఘటనలు చూశాం. తాజాగా, సాధారణ బైక్‌లోనూ రోడ్డుపై ప్రయాణిస్తుండగానే మంటలు వచ్చాయి. ఆ బండి యజమాని తృటిలో స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.  

చెన్నై: ఇటీవలి కాలంలో బైక్‌లో మంటలు వస్తున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లోనే కాదు.. సాధారణ బైక్‌లలోనూ మంటలు రావడం కలకలం రేపుతున్నాయి. తాజాగా, తమిళనాడులో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. బుధవారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్‌లో అనూహ్యంగా మంటలు చెలరేగాయి.

చెన్నైకి చెందిన అరుణ్ రామలింగం అనే వ్యక్తి మాండవేలి సమీపంలో తన బైక్‌పై వెళ్లుతుండగా మంటలు వచ్చాయి. బైక్‌లో మంటలు రావడాన్ని ఆయన వెంటనే పసిగట్టాడు. బైక్ పై నుంచి జంప్ చేశాడు. దీంతో స్వల్ప గాయాలతో అరుణ్ రామలింగం బయటపడ్డాడు. ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు కానీ, బైక్‌ను కాపాడుకోలేకపోయాడు. స్పాట్‌కు ఫైర్ ఫైటర్స్ వచ్చి మంటలు ఆర్పడానికి లోపే ఆ వాహనం పూర్తిగా దగ్దమైపోయింది. 

రోడ్డుపై నడుస్తుండగానే వాహనం ఇలా మంటలు అంటుకుని కాలిపోవడం ఆందోళనలను రేపింది. ముఖ్యంగా ఆ దారి గుండా వెళ్తున్న ప్రయానికులను భయకంపితులను చేసింది.

ఇదిలా ఉండగా, ఇటీవలే ఆంద్రప్రదేశ్‌లో ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఇలాగే మంటలు వ్యాపించాాయి. రవిచంద్రన్ అనే వ్యక్తి ఇటీవలే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్నాడు. దాన్ని మైసూరు నుంచి సుమారు 387 కిలోమీటర్లు నాన్ స్టాప్‌గా నడుపుకుంటూ అనంతపురం జిల్లాలోని కసాపురానికి తీసుకువచ్చాడు. ఉగాది రోజున కసాపురంలోని ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట పార్క్ చేశాడు. బండి పూజ గురించి ఆలయ పురోహితులకు చెప్పారు. వారు కూడా బండి పూజ చేయడానికి రెడీ అయ్యారు. కానీ, రవిచంద్రన్ ఆలయంలోని వెళ్లీ వెళ్లగానే ఆ బండి పెట్రోల్ ట్యాంక్ వద్ద చిన్నగా మంటలు మొదలయ్యాయి. స్వల్ప కాలంలోనే అవి భారీగా ఎగసిపడ్డాయి. అనంతరం ఒక్కసారిగా ఆ పెట్రోల ట్యాంక్ పేలింది. దీంతో కొన్ని మీటర్ల మేర మంటలు ఎగసిపడ్డాయి. దీంతో రవిచంద్రన్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

ఆలయ యజమానులు ఈ ముప్పును గ్రహించారు. వెంటనే నీరు చల్లి మంటలను ఆర్పేసే ప్రయత్నాలు చేశారు. తర్వాత ఆ మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ, ఆపాటికే భారీగా మంటలు రావడంతో ఆ రాయల్ ఎన్‌ఫీల్డ్ పాక్షికంగా కాలిపోయింది. ముఖ్యంగా పెట్రోల్ ట్యాంక్ భాగంలో బైక్ డ్యామేజీ అయింది. స్థానికులు ఆ ఘటనను వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?