Shiv Sena: ప్రతీకార రాజకీయాలు కాదు.. ప్రజల రక్షణపైన దృష్టి పెట్టండి.. బీజేపీకి శివ‌సేన చురకలు

Published : Jun 02, 2022, 03:53 PM IST
Shiv Sena: ప్రతీకార రాజకీయాలు కాదు.. ప్రజల రక్షణపైన  దృష్టి పెట్టండి..  బీజేపీకి శివ‌సేన చురకలు

సారాంశం

Shiv Sena-BJP : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. 

Shiv Sena attacks BJP: కేంద్రంలోని అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) పై శివ‌సేన తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది.  జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన లక్షిత హత్యలపై మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన గురువారం కేంద్రంపై విరుచుకుపడింది. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పౌరులను రక్షించలేకపోయిందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. 1990లలో కాశ్మీరీ పండిట్ల స్థానభ్రంశంపై కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ ఇప్పుడు తమ పాలనలో కాశ్మీర్‌లో జరుగుతున్న వరుస హత్యలకు జవాబుదారీగా ఉండాలని పేర్కొంది.

జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి నేరుగా కేంద్రం పాలనలో ఉంచినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని శివసేన శాసనసభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. కాశ్మీర్‌లోని పండిట్‌లు, సిక్కులు, ముస్లింలను ప్రభుత్వం రక్షించలేకపోతోందని శివ‌సేన పేర్కొంది. “...కశ్మీరీ పండిట్లు, సైనికులు, ముస్లిం పోలీసు అధికారులు చంపబడుతున్నారు..  కానీ ప్రభుత్వం వారిని రక్షించలేకపోతోంది. ప్రధానమంత్రి మరియు హోంమంత్రి రాజకీయాలు మరియు ఎన్నికలలో నిమగ్నమై ఉన్నారు. కశ్మీర్‌లో పరిస్థితిపై వారు దృష్టి సారించాలి. దురదృష్టవశాత్తూ, రాజకీయాలు, ప్రత్యర్థులపై దాడులు, ప్రత్యర్థులపై కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంతో వారు బిజీగా ఉన్నందున కశ్మీరీలలో ఆగ్రహాన్ని చూడలేకపోతున్నారు” అని రౌత్ అన్నారు.

జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలనలో ఉందని శివ‌సేన సంబంధిత ప‌త్రిక సామ్నా పేర్కొంది.“... అలాంటప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఇంకా హింస ఎందుకు జరుగుతోంది? ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న హత్యలు ఎందుకు ఆగలేదు? హిందువులు, సిక్కులు, పండిట్లు మరియు ముస్లింలను ఎందుకు బహిరంగంగా చంపుతున్నారు? అని ప్ర‌శ్నించింది. దీనిపై స్పందించేందుకు బీజేపీ నేత మాధవ్ భండారీ నిరాకరించారు. "సామ్నాపై వ్యాఖ్యానించకూడదని రాష్ట్ర  బీజేపీ యూనిట్ ఒక విధానాన్ని కలిగి ఉంది... ఇది కేవలం వార్తాపత్రిక" అని అన్నారు.

ఇదిలావుండగా, జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న హత్యలు వరుసగా చోటుచేసుకుంటుండటం  ఆందోళన కలిగిస్తోంది. రాజస్తాన్‌కు చెందిన బ్యాంక్ మేనేజర్‌ను ఈ రోజు ఉదయం దుండగులు కాల్చి చంపారు. రాజస్తాన్‌కు చెందిన విజయ్ కుమార్ జమ్ము కశ్మీర్ కుల్గాం జిల్లా అరె మోహన్‌పొరాలోని ఇల్లాఖీ దెహతి బ్యాంక్ బ్రాంచ్‌కు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన బ్యాంకుకు వెళ్తుండగా ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర ఘటనలో బ్యాంకు మేనేజర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసు అధికారులు ట్విట్టర్‌లో వెల్లడించారు. అనంతరం ఆయనను సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆయన పరిస్థితి విషమించి కన్ను మూశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం