జైన దేవాల‌యంలో అమానుష ఘ‌ట‌న‌.. బాలుడిని తాళ్ల‌తో క‌ట్టేసి చిత్ర‌హింస‌లు.. వీడియో వైర‌ల్ 

By Rajesh KarampooriFirst Published Sep 10, 2022, 3:07 PM IST
Highlights

'అహింస పరమో ధర్మం' అనే సందేశాన్ని ఇచ్చే జైనమత గురువు ఓ చిన్న‌ పిల్లవాడిని దారుణంగా శిక్షించాడు. ఇలాంటివి నమ్మడం కాస్త కష్టమే. కానీ, ఓ జైన దేవాలయంలో ఓ పిల్ల‌వాడిని తాడుతో కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య ప్ర‌దేశ్ సాగర్ జిల్లా ఛోటా కరీలాలో చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. 

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌జిల్లాలో మానవత్వం సిగ్గుపడే  ఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది. సాగర్ జిల్లాలోని ఛోటా కరీలాలో ఉన్న జైన దేవాలయంలో ఓ మైనర్ బాలుడి అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. అక్క‌డి గురువు.. ఓ పిల్ల‌వాడిని చేతుల‌ను తాళ్ల‌తో క‌ట్టి ఆపై చెట్టుకు క‌ట్టేసి కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చిన్నారిని గుడి ఆవరణలో కట్టేసి కొట్టిన వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. 

వైర‌ల్ అవుతున్న‌ వీడియోలో ఓ పిల్ల‌వాడు అరుస్తూ జైన సాధువును తనను విడిచిపెట్టాలని వేడుకుంటుండగా, జైన సాధువులు కనికరం చూపకుండా ఆ చిన్నారిని కొట్టడమే కాకుండా తాళ్లతో కట్టేశారు. ఆ బాలుడిని చెట్టుకు క‌ట్టేసి హింసిస్తుండ‌టంలో ఓ బాలుడు ఆ గురువుకు సాయం చేశాడు. ఈ క్ర‌మంలో త‌న‌ని కాపాడాల‌ని ఆ బాధిత బాలుడు స‌హాయం కోసం అరస్తుండ‌టం వీడియోలో చూడ‌వ‌చ్చు. 

ఆ బాలుడి అరుపులు విన్న కొంద‌రూ ఘ‌ట‌న స్థలానికి చేరుకుని కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. ఆ పిల్ల‌వాడిని విడిచిపెట్టాల‌ని కోరారు.. కానీ, అక్క‌డకు వ‌చ్చి వారితో నిందితుడు వారించారు. అక్క‌డ నుంచి వెళ్లిపోయాలని వారి బెదిరించారు.. దీంతో వారు ఏం చేయ‌లేక అక్క‌డ నుంచి వెనుతిరిగారు. ఈ ఘ‌ట‌నను పక్క‌న నుంచి భ‌వ‌నం నుంచి చిత్రీకరించిన‌ట్టు తెలుస్తోంది. వారు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో ఈ దారుణ ఘ‌ట‌న  వెలుగులోకి వ‌చ్చింది.

బాధిత బాలుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిని నిర్భందించి, వేధించినందుకు నిందితుడు జైన సాధువు  రాకేష్ జైన్‌పై  పోలీసులు ఎస్సీ,ఎస్టీ నిరోధ‌క చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. బాలుడు ఆల‌య గేటు వ‌ద్ద ఉండ‌గా రాకేష్ అతడిని త‌న నిర్బంధంలోకి తీసుకున్నాడు. కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

దొంగతనం అనుమానంతో..
 
ఈ కేసులో నిందితుడు జైన్ బ్రహ్మచారి రాకేష్ భయ్యాజీ మాట్లాడుతూ.. ఆ చిన్నారిని దొంగతనం చేశాడనే అనుమానంతో పట్టుకున్నానని చెప్పాడు. పారిపోకుండా కట్టేశాన‌ని తెలిపారు. ఈ సందర్భంలో.. పిల్లవాడు ఆలయ ద్వారం దగ్గర ఉన్నాడని, పొరపాటున ఆలయం లోపలికి ప్రవేశించాడని, ఆ తర్వాత జైన సాధువు కోపంతో అతన్ని కొట్టాడని పిల్లలు, బంధువులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్నారి  బంధువులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

click me!