
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని షికోహాబాద్ స్టేషన్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్స్ దాటుతున్న ఓ మహిళ ప్రాణాలను రైల్వే సిబ్బంది అప్రమత్తతతో కాపాడారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో బైటికి రావడంతో అనేకమంది ట్విట్టర్ యూజర్లు దీన్ని తమ అకౌంట్లలో పోస్ట్ చేశారు. దీంతో దీనిమీద అనేక ట్వీట్లు, రీ ట్వీట్లు నడుస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ ప్రయాణికురాలు.. ఓ ప్లాట్ ఫాంనుంచి మరో ఫ్లాట్ ఫాంకు ట్రాక్స్ దాటుకుంటూ వస్తుంది. ఇది కామన్ గా మన గ్రామాల్లో నగరాల్లో కనిపించే విషయమే. అయితే.. అటువైపు నుంచి ట్రైన్ రావడం ఇక్కడ అసలు సంగతి. ఆమె ఆ ట్రైన్ ను గమనించలేదు. ఇటువైపు ఫ్లాట్ ఫాం మీదికి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు నుంచి.. ట్రైన్ దగ్గరికి వచ్చేస్తుంది..
రోమాలు నిక్కబొడుచుకునే ఈ టెన్షన్ సిట్యుయేషన్ లో... ఆమెను గమనించిన రామ్ స్వరూప్ మీనా అనే రైల్వే సిబ్బంది.. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి.. ఆమెను ట్రాక్స్ మీదినుంచి ప్లాట్ ఫాం మీదికి లాగాడు. అలా అతను లాగడం.. ట్రైన్ స్పీడ్ గా ఆమె వెనకనుంచి వెళ్లి పోవడం లిప్తపాటు క్షణాల్లో జరిగింది. అయితే.. ఆ మహిళ.. తాను పైకి వచ్చాక ఆగకుండా.. తన బాటిల్ కోసం మళ్లీ ట్రైన్ కు సమీపంగా వెళ్లింది. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కానీ దీనిమీద ట్విట్టర్ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘ప్రాణం కంటే బాటిల్ ఎక్కువా’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదంటూ..’ మరికొందరు అన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. వారిని విడిచిపెట్టకూడదు' అని మరొకరు అన్నారు.
సోనూసూద్ : అభిమాని చేసిన పనికి షాక్ అయిన రియల్ హీరో.. అలా చేయద్దంటూ హితవు...
ఇలాంటి ఘటనే ఇటీవల, ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని భర్తనా రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఓ ప్రయాణికుడు రైలు కింద పడి కూడా అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి ప్లాట్‌ఫారమ్, ట్రాక్‌ల మధ్య ఉన్న గ్యాప్‌లో పడిపోయాడు. రైలు అతని మీదినుంచి పూర్తిగా వెళ్లిపోయింది. కానీ అతను క్షేమంగానే ఉన్నాడు. ఆ వ్యక్తి వేగంగా వెళ్తున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించబోగా.. పట్టుతప్పి పట్టాలపై పడిపోయాడని సమాచారం.
అతను బక్కపల్చగా ఉండడం.. ట్రైన్ కి, ప్లాట్‌ఫారమ్ మధ్య ఉన్న ప్లేస్ లో ఒదిగిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది గమనించిన జనం ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ ఘటన మొత్తం వీడియో తీశారు. రైలు వెళ్లిపోయిన తరువాత ఆ వ్యక్తి అక్కడినుంచి లేచి, పట్టాలపై నుండి తన వస్తువులను తీసుకుని.., ముకుళిత హస్తాలతో ప్రేక్షకులకు నమస్కారం చేసి.. అక్కడినుంచి వెళ్లిపోయాడు.