
భానుడు భగభగమంటున్నాడు. ప్రధానంగా ఉత్తరప్రదేశలో ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరాయి. ఉదయం 9 గంటల వరకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీనికి వడగాడ్పులు తోడు కావడంతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారుతోంది. పాఠశాలల్లో పిల్లలకు వేసవి సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరే పరిస్థితి నెలకొంది. అటువంటి పరిస్థితిలో తాజాగా భారత వాతావరణ విభాగం (IMD) కొన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొద్ది రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
IMD ప్రకారం.. గరిష్ట ఉష్ణోగ్రత 45డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుందనీ, దీనికి తోడు వేడి గాలులు తోడు కావడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. వాతావరణ శాఖ తన కొత్త బులెటిన్‌లో.. వేడిగాలుల పరిస్థితి, అది తగ్గే సమయం గురించి కూడా వివరంగా వివరించింది. దీంతో పాటు ప్రజలు ఎండలోకి వెళ్లవద్దని సూచించింది. వేడిని నివారించగల అన్ని చర్యల సహాయంతో ప్రయత్నించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేస్తుంది.
ఈ రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్
జార్ఖండ్- రానున్న మూడు రోజులలో అంటే జూన్ 19 నుండి జూన్ 21 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో జార్ఖండ్ ప్రభుత్వం వేసవి సెలవులను జూన్ 21 వరకు పొడిగించింది.
ఛత్తీస్‌గఢ్ - రాగల మూడు రోజుల్లో కొన్ని చోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న వేడి గాలుల కారణంగా పలు జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు జంజ్‌గిర్-చంపా జిల్లాలో నమోదయ్యాయి.
మహారాష్ట్ర- మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కూడా రానున్న నాలుగు రోజుల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలో పెరుగుతున్న వేడి కారణంగా, హీట్ స్ట్రోక్ కూడా సంభవిస్తుంది.
ఒడిశా- IMD ప్రకారం రాబోయే మూడు రోజుల్లో ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో వడగాల్పలు కొనసాగే అవకాశముందని తెలిపింది.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ
ఉష్ణోగ్రత నమోదు కానున్నదని హెచ్చరించింది. వేడి, తేమతో కూడిన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల వేసవి సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది.
తెలంగాణ- తెలంగాణ కూడా బుధవారం (జూన్ 21) వరకు వివిధ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉష్టోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రస్థాయి నుంచి అతి తీవ్రస్థాయిలో వడగాల్పులు వీచే అవకాశముందని పేర్కొన్నది.
ఆంధ్ర ప్రదేశ్- కోస్తాంధ్రలో రానున్న రెండు రోజుల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులు వీచే అవకాశముందని IMD తెలిపింది. రాష్ట్రం ప్రస్తుతం వేడిగాలుల గ్రిల్‌లో ఉంది. రెండు రోజుల తర్వాత వాతావరణంలో స్వల్ప మెరుగుదల కనిపిస్తుందని తెలిపింది.
బీహార్- ఇక బీహార్ విషయానికి వస్తే.. రాబోయే రెండు రోజుల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. తూర్పు రాష్ట్రంలో గత మూడు రోజుల్లో వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల సుమారు 44 మంది మరణించారు. ఈ ప్రమాదకర పరిస్థితుల మధ్య రాష్ట్రంలోని పాఠశాలలను జూన్ 24 వరకు మూసివేయబడ్డాయి.
పశ్చిమ బెంగాల్- పశ్చిమ బెంగాల్‌లో కూడా కొన్ని చోట్ల రానున్న రెండు రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉంది. పశ్చిమ బుర్ద్వాన్, బీర్భూమ్, ముర్షిదాబాద్, మాల్, దో దినాజ్‌పూర్ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
మధ్యప్రదేశ్ - రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో హీట్ వేవ్ పరిస్థితులు ఎదురవుతాయి. ఇక్కడ ఈ నెలలో (జూన్) రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తరప్రదేశ్ - తూర్పు యుపిలో రాబోయే రెండు రోజులలో హీట్ వేవ్ పరిస్థితుల నుండి ఉపశమనం లభించదని IMD తెలిపింది. ఆ తరువాత 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గొచ్చని తెలిపింది.