heatwave: దంచికొడుతున్న ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ

Published : Apr 10, 2022, 01:14 PM IST
heatwave: దంచికొడుతున్న ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ

సారాంశం

IMD:  దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండ‌ల తీవ్ర‌త గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈ క్ర‌మంలోనే దేశ రాజ‌ధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. తీవ్ర‌మైన వేడిగాలుల‌ను అంచ‌నా వేసిన ఐఎండీ.. ఆరెంజ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.   

heatwave: ఎండ‌లు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌వుతున్న త‌రుణంలో ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలని సూచిస్తున్నాయి. ఎండ‌ల తీవ్ర‌త అధికంగా ఉండే మ‌ధ్యాహ్నం వేళ‌ల్లో బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌టం మంచిద‌ని సూచిస్తున్నాయి. ఎండ‌ల తీవ్ర‌త నేప‌థ్యంలో భార‌త వాతావ‌ర‌ణ విభాగం ప్ర‌జ‌ల‌ను హెచ్చిరించింది. మ‌రీ ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతోంది. వేడిగాలులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. తీవ్ర‌మైన వేడిగాలుల‌ను అంచ‌నా వేసిన ఐఎండీ.. ఆరెంజ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. ఆదివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడింది. ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వేడి వాతావరణం గురించి భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

దేశ‌రాజ‌ధానిలో సాపేక్ష ఆర్ద్రత ఉదయం 8.30 గంటలకు 32 శాతంగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత ఆదివారం 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ అంచనా వేసింది.  పగటిపూట స్పష్టమైన ఆకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అయితే నగరం అంతటా కొన్ని ప్రదేశాలలో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులతో చాలా చోట్ల అధికా ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌వుతాయ‌ని ప్ర‌క‌టించింది. ఇక శ‌నివారం నాడు గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త 42.4 డిగ్రీల సెల్సియస్‌ను తాకడంతో ఐదేళ్లలో ఢిల్లీలో అత్యంత వేడిగా ఉన్న రోజుగా నిలిచింది. పొరుగున ఉన్న గురుగ్రామ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ మార్కుకు దగ్గరకు చేర‌డం ప్ర‌స్తుతం ఎండ‌ల తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. 

ఏప్రిల్ 21, 2017న ఢిల్లీలో గరిష్టంగా 43.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఏప్రిల్ 29, 1941న నమోదైంది. ఏప్రిల్ ప్రథమార్థంలో ఢిల్లీలో ఇంత అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం గ‌త 72 సంత్స‌రాల‌లో ఇదే తొలిసారి అని IMD వెల్ల‌డించింది. ఆదివారం కూడా నగరంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ బేస్ స్టేషన్ సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 42.4 డిగ్రీల సెల్సియస్ గా న‌మోదైంది. అంటే ఈ సమయంలో సాధారణం కంటే ఎనిమిది డిగ్రీలు ఎక్కువ ఇది. 44.5 డిగ్రీల సెల్సియస్ వద్ద, గురుగ్రామ్ సగటు కంటే 10 డిగ్రీలు ఎక్కువగా ఉంది. గురుగ్రామ్‌లో ఆల్ టైమ్ గరిష్ఠ గరిష్ట ఉష్ణోగ్రత 44.8 డిగ్రీల సెల్సియస్ ఏప్రిల్ 28, 1979న నమోదైంది.

శనివారం హర్యానాలోని ఫరీదాబాద్‌లో గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు 45.2 డిగ్రీల సెల్సియస్ గా న‌మోదైంది. మేఘావృతమైన పరిస్థితులు మంగళవారం నుండి ఉక్కిరిబిక్కిరి చేసే వేడి నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చని IMD తెలిపింది. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలు గత వారం రోజులుగా వేడిగాలులతో అల్లాడిపోతున్నాయి. వాయువ్య భారతదేశంలో సుదీర్ఘ పొడి స్పెల్ తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులకు కార‌ణమైంద‌ని IMD అధికారులు తెలిపారు. మున్ముందు వేడిగాలుల తీవ్ర‌త మ‌రింత‌గా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది. ఏప్రిల్‌లో ఢిల్లీలో సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ అన్నారు. ఏప్రిల్ మొదటి 10 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ మార్క్‌ను అధిగమించాయ‌ని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం