Earthquake : అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్ పై 4.9 తీవ్రత నమోదు

Published : Apr 10, 2022, 12:06 PM IST
Earthquake : అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్ పై 4.9 తీవ్రత నమోదు

సారాంశం

అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టమూ, ప్రాణ నష్టమూ జరగలేదు. మూడు రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఇది రెండో భూకంపం. 

అండమాన్, నికోబార్ దీవులలోని క్యాంప్‌బెల్ బేలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్ర‌త రిక్టర్ స్కేల్‌పై 4.9 గా న‌మోదైంద‌ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. క్యాంప్‌బెల్ బేకు ఈశాన్య 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 07:02 గంటలకు ఇది సంభ‌వించింద‌ని పేర్కొంది. 

క్యాంప్‌బెల్ బేలో సంభ‌వించిన ఈ భూకంపం 10 కి.మీ లోతులో ఉందని ఎన్‌సీఎస్ తెలిపింది. ‘‘  క్యాంప్‌బెల్ బే, అండమాన్ మరియు నికోబార్, ఇండియా, ఇస్లాండ్ మరియు నికోబార్‌లో 70 కి.మీలో దూరంలో 10.04.2022 న భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.9. సమయం 07:02:26 IST. లాట్ : 7.50,  పొడవు: 94.31, లోతు : 10 కిలో మీటర్లు ’’ అని NCS ట్వీట్ చేసింది. అయితే ఈ భూకంపం వ‌ల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కొంత ఉపశమనం కలిగించే అంశం.

మూడు రోజుల కిందట కూడా ఇదే అండమాన్, నికోబార్ దీవులలోని క్యాంప్‌బెల్ బేలో భూకంపం వచ్చింది. అయితే అది రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతగా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, బుధవారం సాయంత్రం 6:07 గంటలకు భూకంపం సంభవించింది. ఈ వివ‌రాల‌ను ఎన్ సీఎస్ తెలిపింది. కాగా దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత ప్రభుత్వం ఆధ్వ‌ర్వ్యంలో ఈ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) కొన‌సాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ