భోపాల్: సాధారణంగా చేతి పంపు కొడితే నీళ్లే వస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. కానీ, మధ్యప్రదేశ్‌లో ఓ చోట చేతి పంపు కొడితే నీళ్లకు బదులు లిక్కర్ వచ్చింది. ఇది చూసి పోలీసు అధికారులు ఖంగుతిన్నారు. చేతి పంపు కొట్టినా కొద్దీ బకెట్ల కొద్దీ మద్యం వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్‌లో మాదక ద్రవ్యాలు, మద్యంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కన్నెర్ర చేసింది. పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం తనిఖీలు చేపడుతున్నది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని గుణాలో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వారు ఆశ్చర్యపోయే రీతిలో ఓ చేతి పంపు కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మద్యం అమ్మకాలపై సీరియస్‌గా ఉండటంతో ఈ అక్రమ మద్య మాఫియా తమ వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి కొత్త రీతులను అవలంభిస్తున్నాయి. అధికార యంత్రాంగానికి అంతుబట్టని దారుల్లో తమ వ్యాపారాన్ని యధేచ్ఛగా నిర్వహించుకుంటున్నాయి.
అయితే, గుణాలోనూ ఈ మాఫియా అక్రమాలు నిరాటంకంగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది.గుణాలో భాన్‌పురా అకమ్ర మద్యాన్ని నిర్వహిస్తున్నవారు కొత్త దారిలో వెళ్లారు. అక్రమ మద్యాన్ని పెద్ద ట్యాంకులో భూమిలో పాతి పెట్టారు. అందులో నుంచి కావాల్సినప్పుడు మద్యం తీసుకోవడానికి వారు ఒక టెంపరీర చేతి పంపును ఏర్పాటు చేసుకున్నారు.
Also Read: దసరాతో తెలంగాణకు మద్యం కిక్కు: వారం రోజుల్లో రూ.1128 కోట్ల లిక్కర్ సేల్స్
అక్కడికి వెళ్లిన పోలీసులు, ఎక్సైజు శాఖ సిబ్బంది అనుమానంతో ఆ చేతి పంపును కొట్టారు. అందులో నుంచి మద్యం రావడం మొదలైంది. అది చూసి ఒక్క క్షణం వారు ఖంగుతిన్నారు. అక్రమ మద్య స్థావరాలపై జరిపిన దాడుల్లో సుమారు ఆరు వేల లీటర్ల కల్తీ మద్యాన్ని వారు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.