తిరుగులేని ఐఐటీ మద్రాస్.. ఇండియాలో టాప్ యూనివర్శిటీ ఇదే, వరుసగా మూడోసారి నెంబర్‌వన్

By Siva KodatiFirst Published Sep 9, 2021, 3:10 PM IST
Highlights

2021 సంవత్సరానికి గాను ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మద్రాస్ ఐఐటీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఘనతను ఈ సంస్థ వరుసగా మూడోసారి సాధించడం గమనార్హం. ఈ ర్యాంకింగ్స్ లో బెంగళూరులోని ఐఐఎస్సీ రెండో స్థానంలో నిలిచింది.
 

ఐఐటీ మద్రాస్ మరోసారి తన సత్తా  చాటింది. భారతదేశంలోని అత్యుత్తమ యూనివర్శిటీల్లో ఐఐటీ మద్రాస్ మరోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది. 2021 సంవత్సరానికి గాను ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మద్రాస్ ఐఐటీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఘనతను ఈ సంస్థ వరుసగా మూడోసారి సాధించడం గమనార్హం. అన్ని విభాగాలతో పాటు, ఇంజినీరింగ్ కేటగిరిలో కూడా మద్రాస్ ఐఐటీ తొలిస్థానాన్ని సొంతం చేసుకుంది.

మరోవైపు ఈ ర్యాంకింగ్స్ లో బెంగళూరులోని ఐఐఎస్సీ రెండో స్థానంలో నిలవగా... ఐఐటీ బాంబే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్ పూర్ నిలిచాయి. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, బనారస్ హిందూ యూనివర్శిటీలకు కూడా టాప్ టెన్ లో స్థానం దక్కింది. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం వెల్లడించారు

click me!