పసికందు తలను నోట కరుచుకుని శునకం చక్కర్లు.. మధురై వీధుల్లో దారుణం..

Published : Sep 09, 2021, 01:23 PM IST
పసికందు తలను నోట కరుచుకుని శునకం చక్కర్లు.. మధురై వీధుల్లో దారుణం..

సారాంశం

ఆధ్యాత్మిక నగరం మధురై పీపీకులం ఇండియన్ బ్యాంక్, ఐటీ కార్యాలయం పరిసరాల్లోకి హఠాత్తుగా మద్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చిన ఓ శునకం కలకలం సృష్టించింది. 

చెన్నై : తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. ఓ శుకనం పసికందు తలను నోట కరుచుకుని.. మధురై పీపీకులం పరిసరాల్లో చక్కర్లు కొట్టింది. ఓ యువకుడు అతి కష్టం మీద శునకం నుంచి బిడ్డ తలను లాగేసుకున్ని పోలీసులకు అప్పగించాడు. 

ఆధ్యాత్మిక నగరం మధురై పీపీకులం ఇండియన్ బ్యాంక్, ఐటీ కార్యాలయం పరిసరాల్లోకి హఠాత్తుగా మద్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చిన ఓ శునకం కలకలం సృష్టించింది. ఆ శునకం నోట్లో మరణించిన పసికందు తల ఉండడంతో చూసిన వారందరి హృదయాలు బరువెక్కాయి. దాడి చేస్తుందనే భయంలో ఆ శునకం దగ్గరకు వెళ్లలేదు. 

ఈ సమయంలో సెల్లూరుకు చెందిన అయ్యనార్ పరుగులు తీస్తూ... పసికందు తలను కుక్క విడిచిపెట్టే విధంగా చేశాడు. పోలీసులు బిడ్డ తలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా శిశువు పుట్టి నాలుగు రోజులై ఉండవచ్చని వైద్యులు తేల్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Delhi: ఆగ‌స్టు 4వ తేదీన ప్ర‌ధాని నివాసానికి మార్చ్‌.. మ‌రో ఉద్య‌మానికి సిద్ధం
PM Modi: త‌న త‌ల్లిని దూషించిన వారిపై మోదీ రియాక్ష‌న్‌.. ఆలోజింప‌చేస్తున్న ప్ర‌ధాని మాట‌లు