ఐఐటీ-మద్రాస్ లో 'కుల వివక్ష'పై ప్రధాని మోదీకి లేఖ.. విచారణకి డిమాండ్.. లేదంటే నిరాహార దీక్ష..

Ashok Kumar   | Asianet News
Published : Feb 06, 2022, 04:04 AM IST
ఐఐటీ-మద్రాస్ లో 'కుల వివక్ష'పై ప్రధాని మోదీకి లేఖ.. విచారణకి డిమాండ్.. లేదంటే నిరాహార దీక్ష..

సారాంశం

ఐఐటీ మద్రాస్ అడ్మినిస్ట్రేషన్ నుండి తాను అలాగే తోటి అధ్యాపకులు ఎదుర్కొంటున్న కుల వివక్షకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (HSS) మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విపిన్ పి వీటిల్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

న్యూఢిల్లీ: ఐ‌ఐ‌టి మదాస్ లో కుల ఆధారిత వివక్ష కొనసాగుతోందని ఆరోపిస్తూ మద్రాస్ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విపిన్ పి వీటిల్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. తన ఆరోపణలపై నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్ వార్డ్ క్లాసెస్ (NCBC) స్వతంత్ర విచారణ జరిపించాలని విపిన్ పి వీటిల్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఫిబ్రవరి 24 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.  ఫిబ్రవరి 3న రాసిన వీటిల్  లేఖలో ఈ భూమి నుండి కుల వివక్ష అనే శాపాన్ని తొలగించేందుకు మీరు చర్య తీసుకుంటారని  ఆశిస్తున్నాను అని అన్నారు.

 ఎస్‌సి /ఎస్‌టి / ఒబిసి ఫ్యాకల్టీ అభ్యర్థుల కోసం జరుగుతున్న ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ఐ‌ఐ‌టి-మద్రాస్ ఫ్యాకల్టీ విధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. అలాగే “ఐ‌ఐ‌టి మద్రాస్‌లో  ఎస్‌సి /ఎస్‌టి / ఒబిసి అధ్యాపకుల కోసం జరుగుతున్న ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్  విధ్వంసాన్ని భారత ప్రభుత్వం దర్యాప్తు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అన్ని  ఇంటర్నల్ అండ్ ఇతర ఫిర్యాదుల పరిష్కార విధానాలను చేసిన తర్వాతనే  మీకు వ్రాస్తున్నాను, ”అని లేఖలో పేర్కొన్నారు. 

 ఐ‌ఐ‌టి ఎం  హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న వీటిల్  వెనుకబడిన తరగతుల (OBC) వర్గానికి చెందినవారు. అంతేకాకుండా విపిన్ పి వీటిల్ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అలాగే  నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్ వార్డ్ క్లాసెస్ కు కూడా లేఖ రాశారు.

ఐఐటీ-ఎంలోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో తాను ఎదుర్కొన్న కుల ఆధారిత వివక్షపై వీటిల్ గత ఏడాది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్ వార్డ్ క్లాసెస్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందించారు. దీని తర్వాత ఎన్‌సి‌బి‌సి ఆదేశాల మేరకు ఐఐటీ-ఎం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 

కేరళలో ఓ‌బి‌సి కమ్యూనిటీగా గుర్తింపు పొందిన మణియాని కులానికి చెందిన వీటిల్ కుల వివక్షను ఆరోపిస్తూ జూలై 2021లో ఇన్‌స్టిట్యూట్ నుండి నిష్క్రమించాడు, తర్వాత సెప్టెంబర్‌లో తిరిగి చేరారు. కానీ, ఎన్‌సిబిసికి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అతను వేధింపులకు గురి అయ్యాడు, దీంతో అతను ఇప్పుడు మళ్లీ రాజీనామా చేశాడు. 

అక్టోబర్ 2021లో విచారణ ముగిసినప్పటి నుండి అప్పటి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ అండ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ హెడ్ నన్ను కనికరం లేకుండా వేధించారు. ఇన్‌స్టిట్యూట్‌లోని కులవాద-ఆధిపత్యవాదులు తక్కువ  కులాల వ్యక్తిని శాంతియుతంగా జీవించనివ్వరు, గౌరవంగా పని చేయనివ్వరు అందుకే నేను రాజీనామా చేయాల్సి వచ్చింది" అని వీటిల్ ప్రధానికి రాసిన లేఖలో రాశారు. వీటిల్ ఆరోపణలను పరిశీలించేందుకు ఏర్పాటైన ముగ్గురు సభ్యుల ఐఐటీ-ఎం ప్యానెల్ అక్టోబర్‌లో కుల ఆధారిత వివక్షకు సంబంధించి  ఎలాంటి ఆధారాలు కనుగొనలేదు.
 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !