మరికాసేపట్లో ఐఐటీ పరీక్షా ప్రారంభం: కోవిడ్ నిబంధనలు ఇవే...

By team teluguFirst Published Sep 1, 2020, 9:05 AM IST
Highlights

నేటి నుండి ఆరవ తేదీ వరకు ఐఐటీ పరీక్షలు జరగనుండగా... సెప్టెంబర్ 13వ తేదీన నీట్ పరీక్ష జరగనుంది.నేటి ఉదయం 9.30 నుండి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు పరీక్షలు జరుగనున్నాయి. 

ఐఐటీ -జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. నేటి నుండి ఆరవ తేదీ వరకు ఐఐటీ పరీక్షలు జరగనుండగా... సెప్టెంబర్ 13వ తేదీన నీట్ పరీక్ష జరగనుంది.నేటి ఉదయం 9.30 నుండి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు పరీక్షలు జరుగనున్నాయి.  ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం చెప్పినప్పటికీ... ప్రభుత్వం మాత్రం పరీక్షా నిర్వహించాలని నిశ్చయించుకుంది. 

ఈ పరీక్షల కోసం విద్యార్థులు ఎంట్రీకి వేర్వేరు సమయాలను కేటాయించారు. అందరికి థర్మల్ స్కానింగ్ ద్వారా ఉష్ణోగ్రతలను కొలవనున్నారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నవారిని ప్రత్యేక రూమ్ లో ఉంచి పరీక్ష రాపించనున్నారు. 

ప్రతిఒక్కరు తమ సొంత వాటర్ బాటిల్, శానిటైజర్ తీసుకొని రావాలను ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అందరూ తప్పనిసరిగా మాస్కు, గ్లౌజులు ధరించాలని, కేంద్రం లోకి ఎంటర్ అయ్యేముందుకి సబ్బు పెట్టి చేతులు కడుక్కోవాలి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. 

ఇకపోతే.... చివరి ప్రయత్నంగా ఐఐటీ- జేఈఈ ప్రవేశ పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతూ ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. 

ఇటీవల బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐఐటీ జేఈఈ., నీట్ పరీక్షల విషయమై చర్చించారు.ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఐఐటీ జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇలా సుప్రీమ్ ను ఆశ్రయించాయి. 

కరోనా నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ఈ రాష్ట్రాలు ఈ పిటిషన్ లో పేర్కొన్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13వ తేదీన నీట్ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనుంది.

click me!