తల్లిదండ్రులతో తనకు ఓటు వేయించాలని, దాని కోసం అవసరమైతే రెండు రోజులు భోజనం మానేయాలని మహారాష్ట్ర (Maharashtra assembly election 2024)లోని శివసేన (shiv sena) ఎమ్మెల్యే సంతోష్ బంగర్ (shiv sena mla Santosh L. Bangar) స్కూల్ పిల్లలను కోరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిపక్షాలు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.
మహారాష్ట్రలోని శివసేనకు చెందిన ఓ ఎమ్మెల్యే ఒకరు స్కూల్ పిల్లలకు వింత సలహా ఇచ్చారు. తల్లిదండ్రులను తనకు ఓటేసేలా చేయాలని, లేకపోతే రెండు రోజులు అన్నం తినకూడదని సూచించి అధికార మహాయుతి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. కలమ్నూరి నియోజకవర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంతోష్ ఎల్ బంగర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గంలోని లఖ్ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. పదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న సుమారు 50 మంది పిల్లలతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తల్లిదండ్రులు తనకు (బంగర్) ఓటు వేయకపోతే రెండు రోజుల పాటు తినడం మానుకోవాలని వింత ప్రసంగం చేశారు.
‘‘ ఎందుకు తినడం లేదని తల్లిదండ్రులు అడిగితే, 'సంతోష్ బంగర్' (నాకు)కు ఓటు వేయాలని చెప్పాలి. తరువాతే అన్నం తినాలి’’ అని బంగర్ పిల్లలను వేడుకుంటున్నాడు. ఈ మాటలు విని అతడి మద్దతుదారులు, చుట్టుపక్కల ఉన్న కొందరు స్కూల్ టీచర్లు తమ నవ్వును ఆపుకున్నారు. అయినా పిల్లలతో 'సంతోష్ బంగర్' అంటూ మూడు సార్లు బిగ్గరగా అనిపించారు.
तुमच्या आई बापाला मला मतदान करायला लावा... नाही केल्यास दोन दिवस जेवण करू नका, असा दम विद्यार्थ्यांना देताना शिंदे गटाचे आणि मुख्यमंत्र्यांच्या विश्वासातील आमदार संतोष बांगर या व्हिडिओत दिसत आहे.
निवडणुकीत किंवा निवडणुकीशी संबंधित कोणत्याही कामात प्रचारात लहान मुलांचा वापर करू… pic.twitter.com/x75XtS0Stl
ఈ వింత ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బంగర్ పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) నేతలు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు బంగర్ కు ఓటు వేయకపోతే రెండు రోజులు తినవద్దని పిల్లలను అధికార ఎమ్మెల్యే రెచ్చగొట్టారని కాంగ్రెస్ ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ విమర్శించారు. రాజకీయ ప్రచారానికి గానీ, ఎన్నికలకు సంబంధించిన పనులకు గానీ పిల్లలను ఉపయోగించరాదని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే బంగర్ ప్రచారం కోసం స్కూల్ కు వెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు తనకు ఓటు వేయకపోతే చిన్న విద్యార్థులను రెండు రోజుల పాటు భోజనం మానేయమని ప్రేరేపించినందుకు బంగర్ ఒక రకమైన 'మహాత్ముడు' కదా అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ ఆర్ పవార్ తీవ్రంగా విమర్శించా. సొంత నియోజకవర్గంలో విద్య కోసం ఆయన చేసిన కృషి ఏంటని ప్రశ్నించారు. రాజకీయాల కోసం పిల్లలను వాడుకోవడం నేరమని, అలాంటి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.