Chief Justice of India: చ‌ట్ట స‌భలు, ప్రజా ప్రతినిధులు ఉన్నది దేనికి : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా

Published : Apr 08, 2022, 06:04 AM ISTUpdated : Apr 08, 2022, 07:56 AM IST
Chief Justice of India: చ‌ట్ట స‌భలు, ప్రజా ప్రతినిధులు ఉన్నది దేనికి : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా

సారాంశం

Chief Justice of India: రాజకీయంగా సున్నితమైన అంశాలపై కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలంటే..ఇక ప్రజా ప్రతినిధులను ఎన్నుకొన్నది దేనికి, చ‌ట్ట స‌భలు ఉన్న‌ది దేనిక‌ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అస‌హనం వ్య‌క్తం చేశారు. సుప్రీంకోర్టుపై మోపడంపై  CJI వేదన వ్యక్తం చేశారు.  

Chief Justice of India: రాజకీయంగా సున్నితమైన అంశాలన్నింటిపైనా న్యాయస్థానాలే విచారణ చేస్తే.. ఇక‌ ‘లోక్‌సభ, రాజ్యసభ, ప్రజా ప్రతినిధులు ఉన్నది దేనికి’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అసహనం వ్యక్తంచేశారు. ప్రజా ప్రతినిధులు చట్టసభలకు ఎన్నిక అయింది ఎందుకని చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రశ్నించారు.  బంగ్లాదేశీలు, రోహింగ్యాలు సహా అక్రమ వలసదారులందరినీ ఏడాదిలోగా గుర్తించి, నిర్బంధించి, బహిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ 2017లో సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వివిధ అంశాలపై ఈయన తరచూ న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తూ ఉంటారు.  ఈ పిటిషన్‌ గురువారం సుప్రీంలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. 

మిస్టర్‌ ఉపాధ్యాయ్‌! పార్లమెంటు సభ్యుల అంశమైనా, నామినేషన్‌ అంశమైనా, ఎన్నికల సంస్కరణల అంశమైనా..ప్రపంచంలోని సమస్యలన్నిటిపైనా మీరు పిటిషన్లు వేస్తున్నారు. రాజకీయంగా సున్నితమైన అంశాలపై నిర్ణయం తీసుకునే బాధ్యత ఎన్నుకోబడిన ప్రభుత్వానిదేన‌నీ, ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నింటీని స్వీకరిస్తే.. రాజకీయ ప్రతినిధులను ఏ ఉద్దేశ్యంతో ఎన్నుకుంటారు?... లోక్‌సభ, రాజ్యసభ ఎందుక‌ని CJI అస‌హనం వ్య‌క్తం చేశారు. ఇలాగైతే బిల్లులను కూడా కోర్టులే పాస్‌ చేయాలేమో అని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో కౌంటర్‌ వేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంటే విచారణకు స్వీకరిస్తామని కోర్టులోనే ఉన్న సొలిసిటర్‌ జనరల్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సీజేఐ ర‌మ‌ణ‌ వ్యాఖ్యలపై న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ స్పందించారు. రాజ్యాంగంలో ఉన్న‌ ఆర్టికల్ 32.. ప్ర‌జా ప్రయోజనాల కోసమే ఉందని గుర్తు చేశారు. అయితే..  దీనికి ధర్మాసనం.. చట్టాలు చేయాలా అని ప్రశ్నించింది. ఒకవేళ .. ఈ అంశంపై కేంద్రం కౌంటర్ వేస్తే.. విచార‌ణ‌కు సిద్ధంగా ఉన్న‌ట్టు, ఈ సమయంలో అక్కడ ఉన్న సొలిసిటర్ జనరల్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఏడాదిలోగా..బంగ్లాదేశీలు, రోహింగ్యాలు సహా అక్రమ వలసదారులందరినీ  గుర్తించి, నిర్బంధించి, బహిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ 2017లో సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లిల త్రిసభ్య ధర్మాసనం స్వీక‌రించింది.

ఈ స‌మ‌యంలో ఐదు కోట్ల మంది అక్రమ వలసదారులు మన జీవనోపాధి హక్కును హరిస్తున్నారు.. అక్రమవలసదారులను గుర్తించి, అదుపులోకి తీసుకుని దేశం నుంచి బహిష్కరించాలని పిటిషన్‌లో కోరుతున్నాం.. అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీచేయాలి’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?