పాదుర్ హిందుస్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో స్పెక్టాక్యులర్-2019

By Siva KodatiFirst Published Nov 18, 2019, 8:16 PM IST
Highlights

పాడూర్‌లోని హిందూస్తాన్ ఇంటర్నేషన్ స్కూల్ విద్యార్ధుల కోసం నవంబర్ 14న సైన్స్, ఆర్ట్, క్రాఫ్ట్, రోబోటిక్స్, ఐసిటి ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు

విద్య అంటే చదవగల, వ్రాయగల సామర్ధ్యం అని అర్థం కాదు. ఇది మేథో వికాసం యొక్క పూర్తి ప్రక్రియను వివరించడానికి ఉపయోగించే విస్తృత పదం. ప్రస్తుత పరిస్ధితుల్లో విద్యను ఆచరణాత్మక విధానంతోనే సాధించవచ్చు. ఈ క్రమంలోనే పాడూర్‌లోని హిందూస్తాన్ ఇంటర్నేషన్ స్కూల్ విద్యార్ధుల కోసం నవంబర్ 14న సైన్స్, ఆర్ట్, క్రాఫ్ట్, రోబోటిక్స్, ఐసిటి ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు.

ఇది విద్యార్థుల్లో శాస్త్రియ వైఖరి, పరిశోధనా దృష్టి, కళాత్మకతను పెంపొందించడానికి దోహదపడుతుందని యాజమాన్యం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమానికి తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్‌‌లో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయిన ఆర్. దొరైరాజ్ ముఖ్యఅథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమంలో భాగంగా యువ శాస్త్రవేత్తలు వారి సృజనాత్మకను ప్రదర్శించారు. ఈ సందర్భంగా దొరైరాజ్ మాట్లాడుతూ.. విద్యార్ధుల అద్భుతమైన ఆవిష్కరణలను ప్రశంసించారు. ప్రతి విద్యార్ధిలో దాగున్న అత్యుత్తమ పరిజ్ఞానాన్ని వెలికితీయడంతో పాటు సైన్స్ గురించి మరింత అవగాహన కల్పిస్తున్నందుకు ఆయన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

టెక్నాలజీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌ల ద్వారా వివిధ సామాజిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనవచ్చునని.. అలాగే శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల అవశ్యకతను దొరైరాజు వెల్లడించారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోవాల్సిందిగా ఆయన విద్యార్ధులకు సూచించారు.  ‘‘జీవితాన్ని శక్తివంతంగా జీవించాలని...చేసే దానిని ప్రేమించాలని, చేసే పనిని ఇష్టంగా చేయాలని’’ దొరైరాజు చిన్నారులకు సూచించారు.

ఈ ఎక్స్‌పో ద్వారా విద్యార్థులు ఒకే చోట పనిచేయడానికి వేదికను ఇచ్చింది. శాస్త్రీయ పరిజ్ఙానంపై అవగాహనతో పాటు విద్యార్ధులు ఒకరి అభిప్రాయాలను, ఆలోచనలను మరొకరు గౌరవించుకోవడం, అనుభవాలను పంచుకోవడం, నాయకత్వ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఎక్స్‌పో సాయపడింది.

ఈ సందర్భంగా విద్యార్ధులు తమ ప్రాజెక్టులను అతిథులు, తల్లిదండ్రులకు వివరించారు. ఇది నలుగురిలో మాట్లాడే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు సాయపడుతుందని తద్వారా విద్యార్ధుల ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం పెరుగుతుందని యాజమాన్యం తెలిపింది. 

click me!