ఇండియాపై కరోనా దెబ్బ: 21,393కి చేరిన మొత్తం కేసులు

By narsimha lodeFirst Published Apr 23, 2020, 11:32 AM IST
Highlights

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల వరకు  21,393 కేసులు నమోదయ్యాయి. ఇందులో 16,454 యాక్టివ్ కేసులని కేంద్రం ప్రకటించింది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల వరకు  21,393 కేసులు నమోదయ్యాయి. ఇందులో 16,454 యాక్టివ్ కేసులని కేంద్రం ప్రకటించింది.

కరోనా వైరస్ సోకిన వారు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్య వంతులుగా  4257 మంది తమ ఇండ్లకు చేరుకొన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.ప్రపంచ వ్యాప్తంగా 26 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. 1.83 లక్షల మంది ఈ వైరస్ సోకి మృతి చెందారు. 

దేశంలో వైద్యులపై దాడులను నివారించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. కొత్త ఆర్డినెన్స్ ను తీసుకురావడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొంది. డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకొన్నారు.

5,00.452 లక్షల శాంపిల్స్ ను 4,85,172 మంది నుండి సేకరించారు. వీరిలో 21,797 మందికి కరోనా సోకినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది.ఢిల్లీలోని జామ మసీదు ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా సోకింది. దీంతో ఈ ఇంటికి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు.

also read:కరోనా ఎఫెక్ట్: మాస్కులను కుట్టిన రాష్ట్రపతి సతీమణి

 ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యపై కేంద్రం చెబుతున్న నివేదికల గురించి భయపడాల్సిన అవసరం లేదని      మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే బుధవారం నాడు చెప్పారు. 

ముంబైలో హాట్ స్పాట్స్ సంఖ్య 14 నుండి ఐదుకు తగ్గిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కరోనా కేసులు రెట్టింపయ్యే సంఖ్య 3.1 రోజుల నుండి 7.1 రోజులకు పెరిగిందన్నారు.

కరోనా వైరస్ సమస్య ఇంకా చాలా కాలం పాటు మనతోనే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి అథనామ్ గెబ్రేనాయిస్ బుధవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు.

click me!